The GOAT Collections : ఆల్ టైం గ్రేటెస్ట్ డిజాస్టర్ ఓపెనింగ్స్… మనోళ్లు అస్సలు పట్టించుకోలేదుగా!

The GOAT Collections : కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా నటించిన “ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం” సినిమా ఫైనల్ గా సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కావడం జరిగింది. లియో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ (Thalapathy Vijay) నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా, యాక్షన్ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం దళపతి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూసారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా మొత్తం పరమ రొటీన్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులకు విసుగు పుట్టించేలా వెంకట్ ప్రభు తెరకెక్కించాడని, ఇది గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం కాదని, వరెస్ట్ అఫ్ అల్ టైం అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా గోట్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ రాగా, డే 1 అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయిందని చెప్పాలి.

Thalapathy Vijay 'The GOAT' Movie First Day Collections

మనోళ్లు అస్సలు పట్టించుకోలేదు..

ఇక గోట్ (Goat) సినిమాకు ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ రాగా, ఆ టాక్ సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ కావడంతో ఈవినింగ్, నైట్ షోలకు సినిమా బుకింగ్స్ లో తేలిపోయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే జనాలు అసలు పట్టించుకోలేదు. బుకింగ్స్ స్పీడ్ ని చూసి తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కనీసం 4 కోట్లకు పైగా షేర్ ని అందుకుంటుంది అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ అసలు ఫైనల్ గా తొలిరోజు పూర్తయ్యే సరికి తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్లకి అటు ఇటు గా షేర్ అందుకుందని అంచనా. అయితే విజయ్ పైన రీసెంట్ గా వచ్చిన ఒక రకమైన నెగిటివిటీ వల్ల గోట్ సినిమాని తెలుగు ఆడియన్స్ అంతగా పట్టించుకోకపోగా, వర్షాల ప్రభావం వల్ల మరింత దెబ్బేసారని చెప్పాలి. ఇక ఇప్పుడు బ్యాడ్ టాక్ తెచ్చుకోవడంతో వీకెండ్ లో వచ్చే ఫ్యామిలీ జనాలు కూడా దెబ్బేస్తున్నారు.

- Advertisement -

లియో లో సగం కూడా లేదుగా?

ఇక గోట్ (Greatest OfAllTme) సినిమాకి, విజయ్ కెరీర్ లో రీసెంట్ టైం లో వచ్చిన ఐదారు సినిమాలకంటే లోయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పాలి, లియో (Leo) సినిమాలో సగం కూడా ఓపెనింగ్స్ రాలేదని తెలుస్తూనే ఉంది. ఇక తెలుగులో 22 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసిన గోట్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాలి. ఇక ఒక్క తమిళనాడు (38 కోట్లు) మినహా వరల్డ్ వైడ్ గా గోట్ సినిమాకు డిజాస్టర్ ఓపెనింగ్స్ అందడం జరిగింది. హిందీ వెర్షన్ అయితే కేవలం 1 కోటి మార్క్ అందుకోగా, వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో కలిపి ది గోట్ సినిమాకు 94 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ వచ్చిందని సమాచారం. మరి రెండో రోజు గొట్ సినిమా ఎలాంటి హోల్డ్ చూపిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు