The Goat Collections : గోట్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్… డివైడ్ టాక్ తో రచ్చ.. అయినా నష్టాలు తప్పవు?

The Goat Collections : కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా నటించిన “ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం” సినిమా సెప్టెంబర్ 5న విడుదలైన సంగతి తెలిసిందే. లియో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ (Thalapathy Vijay) నుంచి వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా, యాక్షన్ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం దళపతి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూసారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా మొత్తం రొటీన్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులకు విసుగు పుట్టించేలా వెంకట్ ప్రభు తెరకెక్కించాడని, ఇది గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం కాదని, వరెస్ట్ అఫ్ అల్ టైం అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. అయితే గోట్ కలెక్షన్లు మాత్రం మొదటివారం టాక్ తో సంబంధం లేకుండా బాగానే వచ్చాయి.

The Goat movie first week Collections

డివైడ్ టాక్ తోనూ మాస్ రచ్చ..

ఇక విజయ్ నటించిన గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం (Goat) సినిమాకి డిజాస్టర్ టాక్ రాగా, తొలి వీకెండ్ లో టాక్ తో సంబంధం లేకుండా అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. మొదటిరోజే ఏకంగా వంద కోట్ల ఓపెనింగ్స్ తెచ్చుకోగా, ఆ తర్వాత రోజుకు 50 కోట్ల చొప్పున వీకెండ్ లో అదిరిపోయే వసూళ్లు కొల్లగొట్టాడు. ఇక తాజాగా మొదటివారం పూర్తి చేసుకోగా, వారం రోజుల్లో డిజాస్టర్ టాక్ తో కూడా మాస్ రచ్చ చేసాడని చెప్పాలి. ఇక ఇందులో మేజర్ కలెక్షన్లు, తమిళనాడు, ఓవర్సీస్ నుంచే వచ్చాయి. అయితే తెలుగులో మాత్రం గోట్ ని పూర్తిగా పక్కనబెట్టేశారని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో మొదటివారం 6.60 షేర్ రాబట్టగా, 11.6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఇక్కడ 22 కోట్ల బిజినెస్ చేసిన గోట్ బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 15 కోట్లయినా కావాలి. అది సాధ్యం కానీ పని కాబట్టి, ఇక్కడ గోట్ డిజాస్టర్ కాక తప్పేలా లేదు.

- Advertisement -

తొలివారం కుమ్మేసారు.. కానీ నష్టాలు తప్పవు…

ఇక విజయ్ గోట్ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే… తమిళనాడులో 139.50 కోట్లు, తెలుగు స్టేట్స్ 11.60 కోట్లు, కర్ణాటక 23.55 కోట్లు, కేరళ 11.70 కోట్లు, రెస్ట్ అఫ్ ఇండియా లో 17.10 కోట్లు వసూలు చేయగా, ఓవర్సీస్ లో 128.60 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొత్తంగా తొలివారం వరల్డ్ వైడ్ గా 332 కోట్ల గ్రాస్, 162 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక 187 కోట్ల బిజినెస్ చేసిన గోట్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా 25 కోట్ల వరకు వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. అయితే లాంగ్ రన్ లో ఈ వసూళ్లు వెనకేసుకున్నా, గోట్ డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం నష్టాలు తప్పేలా లేవు. కేవలం తమిళనాడు, ఓవర్సీస్ లో మాత్రమే గోట్ బ్రేక్ ఈవెన్ అవుతుంది. కానీ మిగతా అన్ని ఏరియాల్లో గోట్ డిజాస్టర్ వసూళ్లు అందుకోగా, తెలుగు రాష్ట్రాల్లో అయితే బయ్యర్లు భారీగా నష్టపోయే ఛాన్స్ ఉందని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు