Tollywood : భజే వాయువేగం, గంగం గణేశా ఫస్ట్ వీక్ తర్వాత పరిస్థితేంటి!

Tollywood : టాలీవుడ్ లో గత వారం మూడు క్రేజీ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయన్న సంగతి తెలిసిందే. అందులో విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి, అలాగే ఆనంద్ దేవరకొండ నటించిన గం గం గణేశా, అలాగే కార్తికేయ నటించిన భజేవాయువేగం సినిమాలు రిలీజ్ అయ్యాయి. కాగా మూడు సినిమాలకు థియేటర్లలో మిశ్రమ స్పందన రాగా, గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమా ఫస్ట్ వీక్ డీసెంట్ కలెక్షన్లతో అదరగొట్టి బ్రేక్ ఈవెన్ కి మరో 80 లక్షల దూరంలో ఉండగా, రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఆనంద్ దేవరకొండ నటించిన “గం గం గణేశా” మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే.. వీకెండ్ లో బాగానే పెర్ఫార్మ్ చేయగా, వర్కింగ్ డేస్ లో స్లో అయింది. ఇక ఈ రెండు సినిమాల మొదటి వారం సినిమాల గురించి లెక్కలు చూస్తే ఇలా ఉన్నాయి.

Tollywood movies Bhaje Vayuvegam, Gaam Gaam Ganesha first week collections

‘గం గం గణేశా’ సినిమా వారం కలెక్షన్స్ ని గమనిస్తే…

నైజాం – 1.00 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ – 1.17 కోట్లు వసూలు చేయగా, ఇక రెస్ట్ అఫ్ ఇండియా, కర్ణాటక, ఓవర్సీస్ సహా మరో 31 లక్షలు రాబట్టింది. మొత్తంగా గం గణేశా వరల్డ్ వైడ్ గా 2.48 కోట్ల షేర్ 5.45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా మొత్తం మీద 5.50 కోట్ల బిజినెస్ చేయగా, టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 3 కోట్లకు పైగా షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

- Advertisement -

భజే వాయువేగం కలెక్షన్స్ గమనిస్తే..

ఇక భజే వాయు వేగం మూవీ వరల్డ్ వైడ్ గా మొదటి వారంలో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే.. నైజాంలో 1.27 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ లో 1.54 కోట్లు వసూలు చేయగా, కర్ణాటక, రెస్ట్ అఫ్ ఇండియా, ఓవర్సీస్ సహా మరో 48 లక్షలు రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా “భజేవాయువేగం” సినిమా మొదటివారం లో 3.29 కోట్ల షేర్, 7 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. మొత్తం మీద ఈ సినిమా 4 కోట్ల రేంజ్ లో వాల్యూ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి వారం తర్వాత ఇంకా 71 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక భజేవాయువేగం సినిమా రెండో వీక్ లో మంచి హోల్డ్ ని చూపిస్తే టార్గెట్ ను అందుకునే అవకాశం ఉంది. కానీ గం గం గణేశ మూవీ మాత్రం ఇక నిరాశ పరిచే రిజల్ట్ తోనే పరుగును ముగించబోతుంది. ఇక గత వారం వచ్చిన మూడు సినిమాల్లో గం గణేశా సినిమా ప్లాప్ అని తేలిపోయింది. ఇప్పుడు రెండో వీకెండ్ ని బట్టి గ్యాంగ్స్ అఫ్ గోదావరి, భజేవాయువేగం సినిమాల ఫలితాలని అంచనా వేయొచ్చు. ఇక ఈ వారం టాలీవుడ్ లో (Tollywood) మరో మూడు క్రేజీ సినిమాలు రిలీజ్ కాగా, చాలా వరకు ఈ మూడు సినిమాలు ఉన్న కొన్ని చోట్ల థియేటర్లలో ఈ వారం విడుదలైన సినిమాలను భర్తీ చేసారు. మరి మిగిలి ఉన్న థియేటర్లలో ఈ సినిమాలు ఎలా పెర్ఫార్మ్ చేస్తాయో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు