Tollywood : సత్యభామ, లవ్ మౌళి సినిమాల 2 డేస్ కలెక్షన్స్.. ఆ సినిమాకి బెటర్ రిజల్ట్స్..

Tollywood : టాలీవుడ్ లో గతవారం రిలీజ్ అయిన సినిమాల్లో ఏ సినిమా కూడా అంతగా మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, ఈ వారం అయినా ఒక సూపర్ హిట్ సినిమా వస్తుందన్న ఆశతో ఆడియన్స్ ఉండగా, ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో మొత్తం మీద 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో శర్వానంద్ హీరోగా నటించిన “మనమే” సినిమా, అలాగే ఈ మూవీకి పోటిగా నవదీప్ హీరోగా నటించిన “లవ్ మౌళి” మూవీ, దీంతో పాటు కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ “సత్యభామ” సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ మూడు సినిమాలపై టాలీవుడ్ (Tollywood) లో మంచి అంచనాలు నెలకొని ఉండగా, లవ్ మౌళి సినిమాకు డిజాస్టర్ టాక్ రాగా, మనమే, సత్యభామ సినిమాలకు మిశ్రమ స్పందన లభించింది. ఇక ఈ రెండు సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో పూర్ ఓపెనింగ్స్ రాగా, తాజాగా రెండో రోజు కలెక్షన్ల వివరాలు బయటికి వచ్చాయి.

Tollywood movies LoveMouli, Satyabhama 2days collections

లవ్ మౌళి కలెక్షన్స్..

నవదీప్ హీరోగా నటించిన లవ్ మౌళి సినిమా ఈ వారం థియేటర్లలో డిజాస్టర్ టాక్ అందుకోగా, వసూళ్లు కూడా పడిపోయాయని చెప్పొచ్చు. ఫస్ట్ డే నిరాశ పరిచే ఓపెనింగ్స్ తెచ్చుకోగా, రెండో రోజు కనీసం ఏమైనా గ్రోత్ ఉంటుందని అనుకున్నారు. కానీ రెండో రోజు కూడా దారుణమైన కలెక్షన్లు అందుకుంది. ఇక మొదటి రోజు కలెక్షన్స్ పరంగా లవ్ మౌళి మూవీ కేవలం 15 లక్షల లోపే గ్రాస్ ను అందుకోగా, రెండో రోజు కూడా ఏమాత్రం ఇంపాక్ట్ ను ఈ సినిమా అయితే చూపించలేదు. టార్గెట్ ఆడియన్స్ అయిన యూత్ ఆడియన్స్ కూడా రెండో రోజున సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో టోటల్ గా 2 రోజుల సినిమా కలెక్షన్స్ లెక్క వరల్డ్ వైడ్ గా 25 లక్షల లోపే గ్రాస్ ఉంటుందని అంచనా. ఇక ఈ సినిమా తేరుకునే అవకాశం లేకపోగా, ఈ వారాంతం ముగిసాక థియేటర్ల నుండి తీసేసే అవకాశం ఉంది.

- Advertisement -

సత్యభామ కలెక్షన్స్..

ఇక కాజల్ నటించిన సత్యభామ సినిమా మొదటి రోజున 20 లక్షల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోగా, రెండో రోజు సినిమా కొంచం గ్రోత్ ని చూపించింది. రెండో రోజు ఈ సినిమా 24 లక్షల రేంజ్ దాకా షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సినిమా సొంతం చేసుకున్నట్లు అంచనా. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 28 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా ఉంటుందని అంచనా వేస్తుండగా, టోటల్ గా 2 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ 44 లక్షల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 50 లక్షల రేంజ్ దాకా ఉంటుందని అంచనా. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అయిందని అనిపించుకోవాలి అంటే 2 కోట్ల రేంజ్ లో అయినా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక రెండో రోజు గ్రోత్ ని చూపించడంతో ఈ వీకెండ్ లో స్టడీ కలెక్షన్స్ ని అందుకుని తర్వాత వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తే పర్వాలేదు అనిపించవచ్చు. ఇక లవ్ మౌళి మాత్రం మొదటి రోజే ఫేట్ డిసైడ్ అవ్వగా ఇక తేరుకునే అవకాశం తక్కువే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు