Tollywood : లవ్ మౌళి – సత్యభామ డే 1 కలెక్షన్స్.. ఫస్ట్ డే నే ఒకటి పోయింది..

Tollywood : టాలీవుడ్ లో గతవారం రిలీజ్ అయిన సినిమాల్లో ఏ సినిమా కూడా అంతగా మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, ఈ వారం అయినా ఒక సూపర్ హిట్ సినిమా వస్తుందన్న ఆశతో ఆడియన్స్ ఉండగా, ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో మొత్తం మీద 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో శర్వానంద్ హీరోగా నటించిన “మనమే” సినిమా, అలాగే ఈ మూవీకి పోటిగా నవదీప్ హీరోగా నటించిన “లవ్ మౌళి” మూవీ, దీంతో పాటు కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ “సత్యభామ” సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ మూడు సినిమాలపై టాలీవుడ్ (Tollywood) లో మంచి అంచనాలు నెలకొని ఉండగా, లవ్ మౌళి సినిమాకు డిజాస్టర్ టాక్ రాగా, మనమే, సత్యభామ సినిమాలకు మిశ్రమ స్పందన లభించింది. ఇక మనమే మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా, మిగిలిన 2 సినిమాలు మాత్రం ఓపెనింగ్స్ పరంగా పెద్దగా జోరుని చూపించ లేక పోయాయి.

Tollywood Movies Satyabhama, Love Mouli Movies First Day Collections

లవ్ మౌళి ఫస్ట్ డే కలెక్షన్స్..

ఇక నవదీప్ హీరోగా నటించిన లవ్ మౌళి మూవీ కి కొన్ని చోట్ల మార్నింగ్ షోలకు డీసెంట్ నంబర్ లో యూత్ ఆడియన్స్ వచ్చినా కూడా, ఆ తర్వాత మాత్రం జనాలు పెద్దగా థియేటర్స్ రాలేదు. ఇక లవ్ మౌళి సినిమా మొదటి రోజు 15 లక్షల లోపే గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుందని అంచనా. వర్త్ షేర్ కూడా చాలా తక్కువగానే సొంతం అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా ఫలితం ఆల్మోస్ట్ ఫస్ట్ డే నే డిసైడ్ అయిపోయిందని చెప్పాలి. టాక్ పరంగా లవ్ మౌళి సినిమా ఆల్రెడీ నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, కలెక్షన్ల పరంగా ఓ రెండు మూడు రోజులు బాగుంటాయని అనుకున్నా జరగలేదు. ఇక ఈ వీకెండ్ తర్వాత ఈ సినిమాని థియేటర్ల నుండి తీసేసే ఛాన్స్ ఉందని సమాచారం.

- Advertisement -

సత్యభామ డీసెంట్ ఓపెనింగ్స్…

ఇక అదే టైంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా మెయిన్ లీడ్ గా నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం సత్యభామ మూవీ కి కొంచం పర్వాలేదు టాక్ వచ్చింది. అలాగే జనాలు కూడా పర్వాలేదు అనిపించే విధంగా మొదటి రోజు థియేటర్స్ కి రాగా, సినిమా మొదటి రోజు 35-40 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా, షేర్ 20 లక్షల లోపే ఉంటుందని అంచనా. ఇక మొత్తం మీద మరో వీకెండ్ జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లోనే జనాలు థియేటర్స్ కి వస్తూ ఉండగా, ఈ సినిమాకి కలెక్షన్లు భారీ లెవల్ లో ఇంకా తిరిగి రావాల్సి ఉంది. అలాగే ఆ రేంజ్ లో సినిమాలు కూడా రిలీజ్ ప్రమోట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ సినిమాలకి భారీ గ్రోత్ ఉంటేనే ఏమైనా బయ్యర్లు గాడిలో పడే ఛాన్స్ ఉంది. మరి వీకెండ్ లో ఈ రెండు సినిమాల ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు