Tollywood Top 7 Grossers : తన రికార్డును తానే బ్రేక్ చేయలేకపోయిన ప్రభాస్… అయినా ఆయనే కింగ్

Tollywood Top 7 Grossers : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన సినిమా వస్తుందంటే చాలు కంటెంట్ ఎలా ఉన్నా సరే రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ మాత్రం పక్కా. రీసెంట్ గా కల్కితో మరోసారి 1000 కోట్ల మూవీని తన ఖాతాలో వేసుకున్నారు ప్రభాస్. అయితే టాలీవుడ్లో టాప్ 7 గ్రాసర్స్ లిస్టులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని, మరోసారి తానే ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ అని నిరూపించుకున్నారు రెబల్ స్టార్. కానీ ప్రభాస్ తన మూవీ రికార్డులను తానే బ్రేక్ చేయలేకపోయాడు.

టాలీవుడ్ టాప్ 7 గ్రాసర్స్ లిస్ట్

ఇండియన్ సినిమా డైనమిక్స్ ను మార్చేసిన మూవీ బాహుబలి. అయితే ఇప్పటిదాకా వచ్చిన సినిమాలేవి ఈ మూవీ రికార్డులను బ్రేక్ చేయలేకపోయాయి. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాతో జక్కన్న ప్రయత్నించినా, బాహుబలి తర్వాత ఐదారు సినిమాలతో ప్రభాస్ ట్రై చేసినా బాహుబలి రికార్డ్ మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి మూవీతో కూడా ప్రభాస్ బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేయలేకపోవడం గమనార్హం. ఇక అసలు విషయంలోకి వెళ్తే టాలీవుడ్ టాప్ 7 గ్రాఫర్స్ లిస్ట్ లో ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి 2 మూవీ 1800 కోట్ల కలెక్షన్లతో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఆ తర్వాత 1200 కోట్లతో 2వ స్థానంలో ఆర్ఆర్ఆర్ ఉండగా, 1000 కోట్లతో కల్కి 3వ స్థానంలో, 720 కోట్లతో సలార్ 4వ స్థానంలో, 650 కోట్లతో బాహుబలి 5వ స్థానంలో, 470 కోట్లతో సాహూ 6వ స్థానంలో, 440 కోట్ల కలెక్షన్లతో ఆది పురుష్ 7వ స్థానంలో నిలిచాయి.

Kalki 2898 AD box office – Fails to beat Baahubali 2 in Kerala with first  weekend collection

- Advertisement -

ఆల్ టైం బాక్స్ ఆఫీస్ కింగ్ రెబెల్ స్టార్

అయితే ఈ లిస్టులో ఆల్మోస్ట్ ఆరు సినిమాలు ప్రభాస్ వే ఉండడం విశేషం. అందుకే ఆయన ఎక్కడున్నా రాజే అంటున్నారు అభిమానులు. ఈ అరుదైన రికార్డును బ్రేక్ చేయడం ఎవరి తరం అవుతుందో చూడాలి. అయితే టాలీవుడ్ టాప్ 7 గ్రాసర్స్ లిస్టులో ప్రభాస్ సినిమాలే 6 ఉండడంతో రెబల్ స్టార్ అభిమానులు ఇదీ డార్లింగ్ రేంజ్ అంటూ కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నారు. అంతేకాదు టాలీవుడ్ కాకుండా రెబల్ వుడ్ అని పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ప్రభాస్ మనిషా మానవ మృగమా టాప్ సెవెన్ గ్రాఫర్స్ లో ఆరు సినిమాలు ఆయనవే ఉండడం ఏంటి అంటూ ఫుల్ ఖుషి అవుతున్నారు. మొత్తానికి ఆదిపురుష్ లాంటి అట్టర్ ప్లాప్ సినిమాతో కూడా ప్రభాస్ రేంజ్ మరింత పెరగడమే తప్ప తగ్గకపోవడంతో నిజంగానే ఆశ్చర్యకరం. అదే మరో హీరో ఆ సినిమా చేసి ఉంటే టాప్ గ్రాసర్స్ లిస్ట్ లో మూవీ ఉండడం కాదు ఇండస్ట్రీలో ఆ హీరో కనిపించకుండా పోయేవాడు. రెబల్ స్టార్ ను ప్రేక్షకులు టాలీవుడ్ కింగ్ గా కొలుస్తున్నారు అనడానికి ఇదే నిదర్శనం. మరి బాహుబలి 2 రికార్డును కూడా ఆయనే బ్రేక్ చేస్తే అది మరోచరిత్ర అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్షణం గురించే ఎదురు చూస్తున్నారు రెబల్ స్టార్ అభిమానులంతా. మరి ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో?

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు