The Goat Collections : వినాయక చవితి విజయ్ కు బాగా వర్కౌట్ అయ్యిందే.. ఎన్ని కోట్లంటే?

The Goat Collections : తమిళ సూపర్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy) రీసెంట్ గా “ది గోట్ ” ( The Goat) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఈనెల 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే యావరేజ్ టాక్ ను అందుకుంది. సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులిపేస్తుంది. మొదటిరోజు ఓ రేంజులో కలెక్షన్స్ ను అందుకుంది. ఇక వినాయక చవితికి దేవుడి కటాక్షం ఉందేమో.. కలెక్షన్స్ మోత మోగిపోతుంది. ఇక ఇప్పటివరకు ఎంత కలెక్షన్స్ ను అందుకుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఈ సినిమా ఓపెనింగ్స్ బాగానే అందుకుంది. ఒకవైపు మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నా కూడా రెండో రోజు కలెక్షన్స్ పెరిగాయి. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజైన ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతూ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను క్రియేట్ చేస్తున్నది. ఈ సినిమా 3వ రోజు రాబట్టిన కలెక్షన్ల గురించి ఇప్పుడు ఓ లుక్ వేద్దాం..

Vijay The Goat Collections Raised by Vinayaka Chavity
Vijay The Goat Collections Raised by Vinayaka Chavity

తమిళ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ (AGS) ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ ఈ చిత్రాన్ని భారీ తారాగాణంతో నిర్మించారు. స్నేహ (Sneha) , మీనాక్షి చౌదరీ (Meenakshi Chowdary) , లైలా, ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్‌తోపాటు త్రిషా, శివకార్తీకేయన్ లాంటి హీరో, హీరోయిన్లు స్పెషల్ అప్పీయరెన్స్‌గా కనిపించడం,ఇండస్ట్రీలోని టాప్ టెక్నిషియన్స్ పనిచేయడంతో ఈ సినిమాకు భారీ బడ్జెట్ ను పెట్టాల్సి వచ్చింది. ఏకంగా రూ. 400 కోట్లు ఖర్చు అయ్యినట్లు తెలిసిందే.

- Advertisement -

విజయ్ ది గోట్ మూవీ కలెక్షన్స్..

ఫస్ట్ డే ఈ సినిమా 126 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక రెండో రోజు 55 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 181 కోట్ల రూపాయలు వసూలు చేసింది. విజయ్ కెరీర్‌లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.. మూడో రోజు.. భారీ వసూళ్లు సాధించింది. అటు తమిళనాడులో 30 కోట్ల రూపాయలు, హిందీలో 2.15 కోట్ల రూపాయలు, తెలుగులో 2 కోట్ల రూపాయలు, కేరళలో 1 కోటి రూపాయలు, కన్నడలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 38.5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.. మూడు రోజుల్లో 225 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం 4వ రోజు 300 కోట్ల రూపాయలకు చేరువయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి..

ఇక ఓవర్సీస్ వివరాల విషయానికొస్తే.. ఇండియాలోనే కాదు. కెనడా, అమెరికాలో భారీ కలెక్షన్స్ ను రాబట్టిందని తెలుస్తుంది. ఈ సినిమా మూడో రోజు 475 లోకేషన్లలో 900K డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 3 మిలియన్ డాలర్లను రాబట్టింది.. ఇక ఈ వీకెండ్ రోజు కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు