Arjun Sarja: అర్జున్ ఇంట పెళ్లి సంబరాలు.. ఎమోషనల్ అవుతున్న అర్జున్..!

Arjun Sarja.. ప్రముఖ యాక్షన్ కింగ్ అర్జున్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. అటు తెలుగులో ఇటు కన్నడ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈయన ఈమధ్య కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా అర్జున్ ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి..  ప్రముఖ హీరోయిన్ అర్జున్ పెద్ద కూతురు హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే.. జూన్ 10వ తేదీన చెన్నైలోని హనుమాన్ ఆలయంలో కమెడియన్ తంబి రామయ్య కొడుకును ఈమె వివాహం చేసుకోబోతోంది. ఇక కమెడియన్ తంబి రామయ్య కొడుకు ఉమాపతి ఇండస్ట్రీలో యంగ్ హీరోగా చలామణి అవుతున్నారు.

కూతుర్ని ముద్దు పెట్టుకుంటూ ఎమోషనల్ అయిన అర్జున్..

Arjun Sarja: Wedding celebrations at Arjun's house.. Arjun getting emotional..!
Arjun Sarja: Wedding celebrations at Arjun’s house.. Arjun getting emotional..!

ఇక తాజాగా వీరి పెళ్లికి సంబంధించి హల్దీ, మెహందీ వేడుకలు కూడా చాలా ఘనంగా జరిగాయి.. ఇప్పటికే ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అందులో అర్జున్ సర్జ తన కూతుర్ని ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటూ కనిపించాడు.. ఇక బంధుమిత్రులతో కలిసి ఆమె దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

ఘనంగా ఐశ్వర్య – ఉమాపతిల పెళ్ళి..

ఇక ఐశ్వర్య , ఉమాపతి ఇద్దరూ ప్రేమించుకున్న విషయం తెలిసిందే. ఇక ఇదే విషయాన్ని వారు పెద్దల దృష్టికి తీసుకెళ్లగా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇరు కుటుంబ సభ్యులు సమక్షంలో అక్టోబర్లో హనుమాన్ టెంపుల్ లో నిశ్చితార్థం వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.. ఇప్పుడు అదే ఆలయంలో జూన్ 10వ తేదీన అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది.

- Advertisement -

అర్జున్ సినిమాలు..

యాక్షన్ హీరో అర్జున్ కి అటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు అర్జున్ నటించిన చిత్రాలు నేరుగా తెలుగులోకి డబ్ అయ్యి సూపర్ హిట్ కూడా అయ్యాయి.. అంతేకాదు హీరో గానే కాకుండా సహాయ నటుడిగా, విలన్ గా కూడా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు..

హీరోయిన్ గా సక్సెస్ అందుకోలేకపోతున్న ఐశ్వర్య..

మరొకవైపు అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ కూడా హీరోయిన్ గా పేరు సొంతం చేసుకోవడానికి తెగ ప్రయత్నం చేసింది.. కానీ ఆశించినంత సక్సెస్ రాలేదు. ఇటీవల విశ్వక్ సేన్ తో ఒక సినిమా ప్రకటించారు కూడా కానీ అర్జున్ కి విశ్వక్ కి మధ్య వచ్చిన విభేదాల వల్ల ఆ సినిమా కూడా ఆగిపోయింది.. ఇక ఈమె చేసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాభవాన్ని చవిచూశాయి.. ఇక అలాగే ఈమె తన తండ్రి డైరెక్షన్ లో సినిమాలు చేసినా ఊహించినంత ఫలితం అయితే ఈమెకు రాలేదని చెప్పాలి.

ఉమాపతి కెరియర్..

ఉమాపతి విషయానికి వస్తే.. ఇప్పుడిప్పుడే హీరోగా వెండితెరపై సందడి చేస్తున్నాడు.. మణియారు కుటుంబం , తిరువనం, థానేవాడి , అడగప్పట్టత్తు మనజనంగలే వంటి సినిమాలలో హీరోగా నటించారు.. అలాగే ఇప్పుడు ఉమాపతి చేతిలో మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి.. ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న ఈ జంటకి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ వివాహానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే వివాహం తర్వాత ఐశ్వర్య అర్జున్ సినిమాలలో కొనసాగుతుందో లేదో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Bezique Streams (@beziquestreams)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు