Array

Richest Marriages : ఇండియాలోనే అత్యంత ఖరీదైన పెళ్లిళ్లు ఇవే.. ఆ ముగ్గురివే హైయెస్ట్..

Richest Marriages : పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారు అంటారు.. మూడు ముళ్ళు, వేద మంత్రాల సాక్షిగా జరిగే పెళ్లిళ్లు నిండు నూరేళ్లు బాగుంటాయాని పెద్దలు చెబుతుంటారు.. ఈరోజుల్లో జరిగే పెళ్లిళ్లు ఎలా ఉంటాయో మనం చూస్తూనే ఉన్నాం.. డబ్బున్నోళ్లదే హవా.. ఎవరికీ ఉన్నదాంట్లో వాళ్లు గ్రాండ్ గా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. ఇక ఇండియాలో ఇప్పటివరకు జరిగిన అత్యంత రిచెస్ట్ పెళ్లిళ్ల గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

These are the most expensive weddings in India.
These are the most expensive weddings in India.

ఆకాష్ అంబానీ- శ్లోకా మెహతా..

రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ పెళ్లి మార్చి 9వ తేదీన 2019 లో శ్లోకా మెహతాతో జరిగింది. రస్సెల్ మెహతా, మోనా మెహతాల కూతురు శ్లోక. ఈ పెళ్లి ముంబైలో జరగనుంది. మూడు రోజుల పాటు పెళ్లి సంబరాలు ఉంటాయి. 2018లో ముఖేష్ అంబానీ కూతురు ఈషా అంబానీ పెళ్లి ఆనంద్ పిరమిల్‌తో జరిగిన విషయం తెలిసిందే.. ఈ పెళ్లికి దాదాపు రూ. 1500 కోట్లకు పై ముకేశ్ అంబానీ ఖర్చు చేసినట్లు తెలుస్తుంది..

ఇషా అంబానీ- ఆనంద్ పిరమల్ పెళ్లి..

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ వివాహం డిసెంబర్ 12న 2018 లో ముంబైలో గ్రాండ్ గా జరిగింది. డిసెంబర్ 14న ముంబైలో వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది.. అత్యంత సంపన్నులు అయిన ముకేశ్ తన పిల్లల పెళ్లిళ్లను ఎంత ఘనంగా జరిపించారో మనం చూశాం.. ఇషా అంబానీ పెళ్లికి దాదాపు 735 కోట్ల వ్యయంతో జరిగిందని తెలుస్తుంది..

- Advertisement -

సుశాంతో రాయ్ – సీమాంటో రాయ్ పెళ్లి ..

దివంగత సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ కుమారులు సుశాంతో , సీమాంటో రాయ్‌ అన్నదమ్ముల వివాహం 2004 ఫిబ్రవరి 10, 2004 ఫిబ్రవరి 14 మధ్య జరిగింది. ఈ వివాహానికి అక్షరాలా రూ. 554 కోట్లు ఖర్చు అయింది అని చెబుతారు. లఖ్​నవూలోని సహారా స్టేడియంలో ఈ రెండు వివాహాలు జరిగాయి..

వనీషా మిట్టల్ – అమిత్ భాటియా..

ఉక్కు వ్యాపారవేత్త లక్ష్మీ మిట్టల్ కుమార్తె వనీషా మిట్టల్ వివాహం 2004లో లండన్‌కు చెందిన బ్యాంకర్ అమిత్ భాటియాతో వివాహం జరిగింది.. ఈ పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది.. ప్రత్యేక జెట్ లలో అతిధులను అక్కడకు తరలించారు.. ఈ పెళ్లికి రూ.550 కోట్లను వెచ్చించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి..

బ్రాహ్మణి- రాజీవ్ రెడ్డి పెళ్లి..

2016లో మైనింగ్‌ వ్యాపారి గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె బ్రహ్మణి రెడ్డి రాజీవ్‌రెడ్డి వివాహం దుబారాకు బెంచ్‌మార్క్‌గా నిలిచింది. రాజీవ్ రెడ్డి ఆఫ్రికాలో మైనింగ్ ఆసక్తి ఉన్న ఆంధ్రా వ్యాపారి విక్రమ్ దేవారెడ్డి కుమారుడు.. వీరి వివాహం బెంగళూరులో ఘనంగా జరిగింది.. అత్యంత ఖరీదైన పెళ్లిగా నిలిచింది.. ఈ పెళ్లికి రూ. 500 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది..

సోనమ్ వాస్వానీ- నవీన్ ఫాబియానీ పెళ్లి..

స్టాలియన్ గ్రూప్‌కి చెందిన సునీల్ వాస్వానీ కుమార్తె సోనమ్ వాస్వానీ, వ్యాపారవేత్త కమల్ ఫాబియానీ కుమారుడు నవీన్ ఫాబియానిని జూన్ 2017లో ఆస్ట్రియాలోని వియన్నాలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. డీఎన్‌ఏ ప్రకారం పెళ్లికి రూ.210 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలాసవంతమైన ప్యాలెస్‌లలో ఒకటిగా పేరుగాంచిన వియన్నాలోని సంపన్నమైన బెల్వెడెరే ప్యాలెస్‌లో వివాహం జరిగింది..

సంజయ్ హిందూజా- అను మహతాని పెళ్లి..

వ్యాపారవేత్త సంజయ్ హిందూజా దేశంలోని ప్రముఖ వ్యక్తులలో ఒకరు. అతడు విలాసవంతమైన భారీ వివాహ వేడుకలో తన ప్రియురాలు అను మహతానిని వివాహం చేసుకున్నాడు. సంజయ్ హిందుజా – అను మహతానీల వివాహం భార‌తీయ చ‌రిత్ర‌లో ఎన్న‌టికీ మ‌రువ‌లేనిది.. ఈ వివాహనికి ఉదయ్ పూర్ వేదికయ్యింది.. ఈ వివాహనికి అక్షరాల 150 కోట్లు వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది…

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు.. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ల వివాహనికి 100 కోట్లు, రణవీర్ సింగ్ మరియు దీపికా పదుకొనే వివాహనికి 79కోట్లు, ప్రియాంక చోప్రా మరియు నిక్ జోనాస్ వివాహనికి 60 కోట్లు, అదే విధంగా సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ 10 కోట్లు, ఇక ఐశ్వర్యరాయ్ మరియు అభిషేక్ బచ్చన్ 7కోట్లు వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.. ఇక ఇప్పుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి దాదాపుగా 2000 కోట్లు వెచ్చించనున్నట్లు సమాచారం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు