Tollywood : విలన్లుగా మారిన స్టార్ హీరోలు.. ఒక్కో సినిమాకు రెమ్యూనరేషన్ ఎంతంటే?

Tollywood : ఒకప్పుడు సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు హిట్ సినిమాల్లో నటించి బ్లాక్ బాస్టర్ సినిమాలను అందుకున్న స్టార్ హీరోలు ప్రస్తుతం తెలుగు సినిమాల్లో విలన్ పాత్రల్లో మెప్పిస్తున్నారు. విలన్లు హీరోలు అవ్వడం కొత్తేమి కాదు.. కానీ హీరోలు విలన్లు గా సక్సెస్ అవ్వడం ట్రెండ్.. ఆ లిస్ట్ లో చాలా మంది స్టార్ హీరోలే ఉన్నారు.. ఏ హీరో ఏ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చారు.. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు.. వారి రెమ్యూనరేషన్ ఎంత అనే విషయాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఆనాటి హీరోల విషయానికొస్తే.. కృష్ణం రాజు హీరోగా ఎంట్రీ ఇచ్చినా కూడా విలన్ గానే బాగా ఫేమస్ అయ్యాడు.. అలాగే మోహన్‌బాబు విలన్‌గా కెరీర్‌ మొదలుపెట్టి హీరోగా కలెక్షన్‌ కింగ్‌ అనిపించుకున్నాడు. శ్రీకాంత్‌ సినీప్రస్థానం విలన్‌గా మొదలై హీరోగా విలక్షణ నటుడు అనిపించుకున్నాడు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఒకప్పుడు హీరోగా ఇండస్ట్రీని దున్నేసిన నటులు విలన్లుగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ కొనసాగిస్తున్నారు… ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న విలన్ లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

జగపతి బాబు..

- Advertisement -
tollywood best villains and remuneration
tollywood best villains and remuneration

ఫ్యామిలీ హీరోగా జగపతిబాబుకు ఒకప్పుడు శోభన్‌బాబుకు ఉన్నంత ఫాలోయింగ్‌ ఉండేది. హీరోగా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో అయిష్టంగానే విలన్‌గా ఒప్పుకొన్నాడు. ‘లెజెండ్‌’ సినిమాలో విలనిజంతో జగపతి బాబోయ్‌ అనిపించుకున్నాడు. ఆపై వారసత్వ హీరోకు వరుస అవకాశాలు వెల్లువెత్తినట్టు జగపతిబాబు ముందు విలన్ పాత్రలు క్యూ కట్టాయి.. అప్పటి నుంచి ఇప్పటివరకు వరుస హిట్ సినిమాల్లో నటిస్తున్నారు.. ఈ ఏడాది వచ్చిన గుంటూరు కారం సినిమాకు 2 కోట్లు వరకు తీసుకున్నారని టాక్.. సినిమా సినిమాకు పెరుగుతుందని గతంలో చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు..

విజయ్ సేతుపతి..

tollywood best villains and remuneration
tollywood best villains and remuneration

తమిళ నటుడు విజయ్‌ సేతుపతి ఇప్పుడు అందరివాడు అయ్యాడు. హీరోగా ఆయనకున్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. విలక్షణ నటనతో తెలుగు రాష్ర్టాల్లోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌కు విలన్‌గా పరిచయమయ్యాడు. కథానాయిక తండ్రి పాత్రలో ఆయన చూపించిన విలనిజానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతకుముందు తమిళంలో ‘విక్రం వేద’లో ప్రతినాయకుడిగా ప్రతి సీన్‌లోనూ మెప్పించాడు.. ఒక్కో సినిమాకు ఈయన రూ. 10 నుంచి 12 కోట్లకు పైగా తీసుకుంటున్నాడని సమాచారం.. ప్రస్తుతం తెలుగుతో పాటుగా హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చాడు.. రీసెంట్ గా మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది..

ఆది పినిశెట్టి..

tollywood best villains and remuneration
tollywood best villains and remuneration

ఆది మొదట హీరోగా చేశాడు సక్సెస్ ను అందుకున్నాడు.. ఇప్పుడు విలన్ గా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. విభిన్న చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ఇమేజ్‌ సొంతం చేసుకున్న ఆది.. ‘సరైనోడు’ సినిమాలో విలన్‌గా అంచనాలకు మించి అదరగొట్టాడు.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఈయన ఒక్కో సినిమాకు 3 కోట్ల వరకు తీసుకుంటున్నాడు..

వీళ్లే కాదు ఒకప్పుడు శ్రీకాంత్ కూడా విలన్ గా చేసి మెప్పించాడు.. ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.. అలాగే గోపి చంద్, పృథ్వి రాజ్ సుకుమార న్, అరవింద స్వామి లాంటి స్టార్ హీరోలు విలన్ పాత్రల్లో మెప్పించారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు