Kajal Agarwal: కాజల్ ని ఇబ్బంది పెడుతున్న ఆ డైరెక్టర్ ?

Kajal Agarwal: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ మోడల్ గా తన కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత సినిమాల మీద ఉన్న ఆసక్తితో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో హీరోయిన్గా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఆ సినిమా అనంతరం ఈ బ్యూటీ వెనుతిరిగి చూసుకోకుండా వరుస సినిమాల్లో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దాదాపు ఈ బ్యూటీ పదేళ్లపాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తన హవాను కొనసాగించింది. స్టార్ హీరోలు అందరి సరసన నటించి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఎన్నో అవార్డులను సైతం అందుకుంది. ఇక ఈ బ్యూటీ సినిమాల్లో మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది.

HBD Kajal Agarwal: He was the first crush.. One sided love in college days..!

- Advertisement -

ఇక వివాహం అనంతరం ఈ బ్యూటీ ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులపాటు కాజల్ సినిమాలకు కాస్త దూరంగా ఉండి తన మాతృత్వాన్ని ఎంజాయ్ చేసింది. ఈ మధ్యకాలంలో మళ్లీ ఈ బ్యూటీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి తన హవాన కొనసాగిస్తోంది. కాజల్ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను పలకరిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు ఆసక్తి పెంచుతూ ఉంటుంది.

ఇండస్ట్రీలో దర్శకుడు తేజ గురించి ప్రత్యేకంగా చెప్పినవసరం లేదు. అతడికి చాలా మంది హీరోయిన్లు భయపడిపోతారు. అలా అతడి కోపాడికి బలైన హీరోయిన్లు ఎందరో ఉన్నారు. అతని కోపానికి బలైన హీరోయిన్లలో కాజల్ కూడా ఒకరు. అయితే కాజల్ తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటించింది. ఈ సినిమాలో రానా హీరోగా నటించారు. ఇక ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో లవ్, రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి.

అయితే ఈ సినిమాలో కాజల్ ని రానా వెనుక నుంచి హగ్ చేసుకునే సీన్ ఉంటుంది. అయితే ఆ సీన్ తీసే సమయంలో కాజల్ కాస్త ఇబ్బందిగా ఫీల్ అయిందట. అలా ఆ సమయంలో ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా ఇవ్వకపోవడంతో తేజానే స్వయంగా కాజల్ ని వెనుక నుంచి వచ్చి హగ్ చేసుకున్నారట. ఇక ఆ సమయంలో కాజల్ కాస్త ఇబ్బందిగా ఫీల్ అయిందట. ఈ విషయం డైరెక్టర్ కి, హీరో రానాకి, మరెవరికి చెప్పుకోలేక కాస్త ఇబ్బంది పడిందట. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు