Viswambhara: విశ్వంభర థియేటర్స్ హక్కుల సొంతం చేసుకున్న యంగ్ ప్రొడ్యూసర్

Viswambhara: తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాలలో విశ్వంభర ఒకటి. ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేస్తున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు దాని మీద దృష్టిలో పెట్టుకొని ఈ చిత్ర యూనిట్ గ్యాప్ లేకుండా పనిచేస్తూ వస్తుంది. ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి(MM Keeravani) సంగీతం అందిస్తున్నారు. వశిష్ట(Vashista) చేస్తున్న రెండవ సినిమా ఇది. ఈ సినిమా మీద అందరికీ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సరసన త్రిష(Trisha) ఈ సినిమాలో నటిస్తున్నారు.

సినిమా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమాకి మంచి డిమాండ్ ఉంది. ఇంక మామూలు సీజన్లో కంటే కూడా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యే ఒక సినిమాకి కలెక్షన్స్ ఒక రేంజ్ లో వస్తాయి అని చెప్పాలి. అందుకే అగ్ర నిర్మాత దిల్ రాజు(Dil Raju) ప్రతి సంక్రాంతికి తమ బ్యానర్ నుంచి ఒక సినిమా వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. సంక్రాంతి అనగానే ఖచ్చితంగా ఆ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది. ఇక విశ్వంభర సినిమాకు సంబంధించిన థియేటర్ రైట్స్ ను ఒక యంగ్ ప్రొడ్యూసర్ సొంతం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీ, సిడెడ్, నైజం హక్కులను దాదాపు 120 కోట్ల వరకు కోట్ చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ ఒకటి రెండు రోజుల్లో రేట్ ఫైనల్ అయ్యాక అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది.యంగ్ ప్రొడ్యూసర్ గతంలో కూడా కొన్ని సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు.

Viswambhara

- Advertisement -

ఇకపోతే బింబిసారా(Bimbisara) సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు వశిష్ట. దాదాపు కళ్యాణ్ రామ్(Kalyan Ram) కెరియర్ అయిపోయింది అనుకునే టైంలో ఈ సినిమా ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ అయింది. ఈ జోనర్ లో తెలుగు సినిమాలు వచ్చి చాలా రోజులు అయిపోయింది. బింబిసారా మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇది దీని సీక్వెల్ పైన కూడా అందరికీ మంచి అంచనాలు. ఇక విశ్వంభర సినిమా కూడా సోషియో ఫాంటసీగా తెరకెక్కుతుంది. గతంలో జగదేకవీరుడు అతిలోకసుందరి(Jagadeka veerudu Athiloka Sundari) సినిమా ఎలా ఉందో ఈ సినిమా కూడా అలానే ఉండబోతుంది అని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు