kajal Agarwal : చిరంజీవితో టార్చర్ అనుభవించిన కాజల్ అగర్వాల్…!

కాజల్ అగర్వాల్ పరిచయం అక్కర్లేని నిండు చందమామ. ఈ ముద్దుగుమ్మ ఖాతాలో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు ఉన్నాయి. మొదట ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన “లక్ష్మీ కళ్యాణం”, “చందమామ” వంటి సినిమాల నుండి ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించి హీరోయిన్గా స్టార్ డమ్ సంపాదించింది. ఇప్పుడు తల్లి అయిన తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. రావడం రావడమే బాలయ్యతో “భగవంత్ కేసరి” సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది.

ఇక చిరుతో జతకట్టిన హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. చిరంజీవి నటించిన “ఖైదీ నెంబర్ 150″లో నటించిన బ్యూటీ….కొద్ది కాలం షూటింగ్ కంప్లీట్ అయ్యాక “ఆచార్య” మూవీ నుంచి తప్పుకుంది. ఇది ఇలా ఉంటే…ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ చిరంజీవి గురించి వైరల్ కామెంట్స్ చేసింది.

‘నేను ఎంతోమంది హీరోలతో డ్యాన్స్ చేశాను. కానీ చిరంజీవితో డ్యాన్స్ చేయడం అంటే కాస్త భయం వేసేది. అంతేకాదు ఆయన ఎలాంటి షార్ట్ అయినా సింగిల్ టేక్ లో పూర్తి చేస్తారు. కానీ నేను సుమారు 7 టేకుల వరకు తీసుకునేదాన్ని. ఆ సమయంలో ఆయన ఏమైనా అంటారేమోననే భయంతో నరకం అనుభవించేదాన్ని’ అంటూ చెప్పుకొచ్చింది కాజల్.

- Advertisement -

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు