Hema : బురఖా లో దర్శనమిచ్చింది.. ఎంత కవర్ చేసినా లాభం లేదు..!

Hema : టాలీవుడ్ నటి హేమ రీసెంట్ గా బెంగుళూర్ రేవ్ పార్టీ కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల కింద తెలుగు, కన్నడ ఇండస్ట్రీ లలో సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ న్యూస్ టాలీవుడ్ లో కలకలం రేపింది. టాలీవుడ్ సెలెబ్రటీస్ లో కొంతమంది పేర్లు వైరల్ కాగా, ప్రత్యక్షంగా అయితే నటి హేమను అరెస్ట్ చేసినప్పటి నుంచి, ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి, ఈ కేసులో తన పేరు ఉండకుండా చేయడానికి హేమ చాలా ప్రయత్నాలు చేసింది. మొత్తంగా నటి హేమ మాత్రం అక్కడికి వెళ్లినట్టు ప్రూవ్ అయింది. అయితే నటి హేమ (Hema) ఈ కేసులో పడకుండా, తాను బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లలేదు అన్నట్టు క్రియేట్ చేయ్యడానికి చాలా ట్రై చేస్తూ, అందులో భాగంగా వీడియోలు కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వీడియోలు కూడా బెంగుళూరు లోనే తీసినవని, హైదరాబాద్ లో ఉన్నట్టు చెప్పిందని పోలీసులు కంఫర్మ్ చేసారు. ఇక దాంతో పాటు బిర్యానీ అని, ఆవకాయ్ అని, సాంబార్ అని ఏవేవో వంటలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ జనాల సింపతీ కోసం ట్రై చేసింది. కానీ అవేమి వర్కౌట్ కాలేదు.

Actress Hema attends police interrogation in burqa

బురఖాలో హేమ దర్శనం..

ఇక నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మంగళవారం ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు. బెంగళూరులో గత నెల 20న జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు. ఆమె రక్త నమూనాలో డ్రగ్స్ పాజిటివ్‌ను గుర్తించారు. దీంతో విచారణకు రావాలని ఆమెకు సీసీబీ పోలీసులు మూడుసార్లు నోటీసులు ఇచ్చారు. రెండుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆమె హాజరుకాలేదు. తనకు ఆరోగ్యం బాగాలేదని, ఏవేవో కథలు చెప్పింది. అయితే ఫైనల్ గా మూడోసారి నోటీసుతో సోమవారం విచారణకు హాజరయ్యారు. అయితే ఇక్కడ మీడియా కంటపడకుండా బురఖాలో ఆమె విచారణకు హాజరుకావడం గమనార్హం. అయితే హేమ ఒక ముస్లిం ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

ఎంత కవర్ చేసినా లాభం లేదు..

ఇక ఉదయం నుంచి ఆమెను సీసీబీ పోలీసులు విచారించారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీ నిర్వహణలో ఆమె కీలక పాత్ర వహించినట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. నటి హేమతో పాటు డ్రగ్ పెడ్లర్ ఇమ్రాన్‌ షరీఫ్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. బెంగళూరు రేవ్ పార్టీకి పెద్ద ఎత్తున షరీఫ్‌ డ్రగ్స్ సప్లై చేసినట్లుగా గుర్తించారు. ఈ పార్టీలో 86మందికి డ్రగ్‌ పాజిటీవ్‌గా తేలింది. అందులో 59మంది పురుషులు, 27మంది మహిళలున్నారు. అయితే బురఖా లో ఉన్న హేమపై మరిన్ని ట్రోల్స్ వస్తున్నాయ్. దీనికి హేమ సైడ్ నుండి కొంతమంది ఆమె ఒక ముస్లిం ని పెళ్లి చేసుకుంది కాబట్టి, ఆ పద్దతి లో విచారణకి వచ్చింది అని అంటున్నారు. కానీ కొందరు నెటిజన్లు ఇన్నాళ్లు లేని పద్ధతి ఇప్పుడు గుర్తొచ్చిందా అని ట్రోల్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు