Aditi Govitrikar: మరో తెలుగు హీరో… రాత్రి గదిలోకి రమ్మన్నారు అంటున్న పవన్ హీరోయిన్.!

రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రేక్షకులకు హీరో పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో చిత్రాలలో పలు రకాల విభిన్నమైన పాత్రలలో నటించి తనకంటూ ఒక విభిన్నమైన స్టైల్ ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్.. ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఎంతోమంది హీరోయిన్లను సైతం తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసి పలు రకాల రికార్డులను కూడా సృష్టించారు.
ఇదిలా ఉండగా.. ఫిల్మ్ ఇండస్ట్రీ లో చాలామంది హీరోయిన్స్ డైరెక్టర్ల దగ్గర, హీరోల దగ్గర అనిగిమనిగి ఉంటారు అంటూ వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే వారి దగ్గర ఏదైనా తేడా వస్తే రాబోయే రోజుల్లో సినిమా అవకాశాలు ఇస్తారో లేదో అని అంతలా భయపడుతూ ఉండేవారు హీరోయిన్స్ .. అయితే ఈ పద్ధతి దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది. కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఇలాంటి వాటికి భయపడకుండా ఎదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. రీసెంట్ గా కొన్ని ఇంటర్వ్యూలలో చాలామంది పాల్గొని ఇండస్ట్రీలో ఎదురైనటువంటి ఇబ్బందులను గురించి తెలియజేస్తూ ఉన్నారు.
అయితే ఇప్పుడు తాజాగా ఒక నటి అదితి గోవిత్రికర్ అందరికీ సుపరిచితమే. అయితే ఈమె పేరు తెలియకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన హీరోయిన్ అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు.. ముఖ్యంగా ఈమె మీద “వయ్యారిభామ నీ హంస నడక” అనే పాటను కూడా చిత్రీకరించడం జరిగింది. ఈ పాట అప్పట్లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇందులో చాలా రిచ్ హీరోయిన్ గా కనిపించి మరింత క్రేజ్ అందుకుంది.
ఇటీవలే అదితి గోవిత్రికర్ మాట్లాడుతూ.. తనని ఒక పేరు ఉన్న హీరో సినిమాలలో నటిస్తున్న సమయంలో.. తనని డైరెక్టుగా అలాంటి విషయాన్ని అడగకుండా చిన్న చిన్న సైగలు చేశారని.. కానీ ఆయన చేసే సైగలు అర్థం చేసుకొని నీకేమైనా పిచ్చా అంటూ మాట్లాడానని అయితే ఆ తర్వాత నేను అన్న మాటకు ఆ హీరో కోపం తెచ్చుకొని తనని ఆ మరుసటి రోజే ఆఫ్రికా నుండి ఇంటికి పంపించేశారట..
ఆ తర్వాత మళ్లీ ఒకరోజు ఆ హీరో తనని హోటల్లో కలిశారని అయితే అప్పట్లో సినిమాకి సంబంధించిన ఎన్నో విషయాలు హోటల్స్ లోని మీటింగ్స్ జరిగేవి అలా ఒకసారి తనని కూడా అక్కడికి వెళ్లిన సమయంలో ఆ హీరో వచ్చి.. మీ ఇంటికి ఫోన్ చేసి ఈరోజు రాత్రికి రాను మార్నింగ్ వస్తానని చెప్పు అని అడిగారట. అయితే ఆ హీరో అలా అనడంతో ఆమె కన్నీరు పెట్టుకుందని తెలిపింది. అయితే ఆ హీరో దురుద్దేశం గమనించి అక్కడి నుంచి పారిపోయాను అంటూ తెలియజేసింది అదితి గోవిత్రికర్.. అయితే ఇంతకీ ఆ హీరో ఎవరనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు..
Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు