Adhurs: దాదానే పక్కన పెట్టేసారు, ఇంకా అదుర్స్ ని ఆదరిస్తారా.?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రీసెంట్ టైమ్స్ లో రీ- రిలీస్ ట్రెండ్ జరుగుతున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక్కడు సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన జల్సా సినిమాతో పీక్ కి వెళ్ళింది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక్కడు, పోకిరి సినిమాలను రిలీజ్ చేశారు. మహేష్ కెరియర్లో ఒక్కడు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. మహేష్ బాబు ఒక్కడు సినిమాకి కేవలం మహేష్ ఫ్యాన్స్ ఏ కాకుండా మిగతా హీరో అభిమానులు కూడా బ్రహ్మరథం పట్టి ఆ సినిమాను పైకి లేపారు. అలానే పోకిరి సినిమా కూడా అదే రేంజ్ లో కలెక్షన్ ఇప్పించారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ బర్త్ డే కనుకగా రిలీజైన తమ్ముడు సినిమాకి, అలానే జల్సా సినిమాకి మంచి కలెక్షన్లను అందించారు అభిమానులు. అంతేకాకుండా ఖుషి సినిమా కూడా అద్భుతమైన కలెక్షన్లను కొల్లగొట్టింది. రామ్ చరణ్ కెరియర్ లో వచ్చిన డిజాస్టర్ ఫిలిం ఆరెంజ్ సినిమా అయితే ఊహించని విజయాన్ని అందుకుంది. మళ్లీ ఆరెంజ్ కి సీక్వెల్ గా ప్లాన్ చేయండి అని డైరెక్టర్ని రిక్వెస్ట్ చేసే స్థితికి కూడా వచ్చింది.

ఈ సినిమాలతో పాటు ప్రభాస్ నటించిన ఛత్రపతి. అల్లు అర్జున్ నటించిన దేశముదురు. ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఈ సినిమాలకి అనుకున్న ఫలితాలు రాలేదు. అలానే మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో వచ్చిన మెగా బ్లాక్ బస్టర్ మూవీ శంకర్ దాదా ఎంబిబిఎస్ కి కూడా సరైన రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు తాజాగా వివి వినాయక దర్శకత్వంలో వచ్చిన అదుర్స్ సినిమాని రీ రిలీస్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి కూడా టికెట్ బుకింగ్స్ అంతంత మాత్రమే ఉన్నాయి.

- Advertisement -

తెలుగు ప్రేక్షకులు ఒక గొప్ప సినిమాకి బ్రహ్మరథం పడతారు అనడంలో అతిశయోక్తి కాదు ఎందుకంటే మన భాష కాకపోయినా రఘువరన్ బీటెక్, త్రీ, బృందావన కాలనీ సినిమాలకు అద్భుతమైన కలెక్షన్లు అందించారు. ఇకపోతే ఏవి బడితే ఆ సినిమాలను రిలీజ్ చేయడంతో ప్రేక్షకులలో కూడా ఆసక్తి తగ్గిపోయిందని చెప్పవచ్చు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు