Vaishnav Chaitanya: మరోసారి బన్నీకి చెల్లిగా నటించనున్న వైష్ణవి చైతన్య.. ఏ సినిమా అంటే..?

Vaishnav Chaitanya: ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో మోస్ట్ పాపులారిటీ సంపాదించుకోవచ్చా అంటే.. మొహమాటం లేకుండా ఎస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ముద్దుగుమ్మలు ఒకే ఒక సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ కోవా కి చెందినదే వైష్ణవి చైతన్య కూడా.

బేబీ చిత్రంతో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ఈ బ్యూటీ తాజాగా ఆశిష్ హీరోగా నటించిన లవ్ మీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రజెంట్ వర‌స‌ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా వైష్ణవి చైతన్య పై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ముద్దుగుమ్మ ఓ స్టార్ హీరోకి చెల్లెలి పాత్రలో నటించబోతుందట. మరి ఆ స్టార్ హీరో ఎవరు అని ఆలోచిస్తున్నారా? ఆ హీరో మరెవ్వరో కాదు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన బన్నీ ప్రజెంట్ పుష్ప సీక్వెల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు.

aishnavi Chaitanya who will once again play the role of Bunny's sister
aishnavi Chaitanya who will once again play the role of Bunny’s sister

ఇక ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ ..అట్లీ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో బన్నీకి చెల్లీ పాత్రలో వైష్ణవి చైతన్య నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో అలా వైకుంఠపురం సినిమాలో బన్నీకి చెల్లి పాత్ర పోషించింది వైష్ణవి చైతన్య. ఇక అప్పుడు వైష్ణవి చైతన్య కి అంతగా క్రేజ్ లేదు. కానీ ప్రెసెంట్ ఈమెకి స్టార్ హీరోయిన్ క్రేజ్ ఉంది. అయినప్పటికీ అల్లు అర్జున్ సినిమా అనగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సిస్టర్ పాత్రకి ఓకే చెప్పిందట ఈ ముద్దుగుమ్మ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు