Aishwarya – Abhishek Divorce : బచ్చన్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టింది ఎవరు? ఐష్, అభి విడాకులు ఆ హీరోయిన్ వల్లేనా?

Aishwarya – Abhishek Divorce : ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌లు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ రూమర్లు తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు కూడా ఆ పుకార్లు నిజమే అన్పిస్తున్నాయి. మరి ఐశ్వర్య, అభిషేక్ విడాకులకు కారణం ఎవరు ? బచ్చన్ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఏ హీరోయిన్ ? అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

బచ్చన్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టింది ఈ హీరోయినే?

బాలీవుడ్‌లోని ప్రముఖ కుటుంబాలలో బచ్చన్ కుటుంబం ఒకటి. అమితాబ్, జయా బచ్చన్ కుటుంబంలో జరుగుతున్న సంఘటనల గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. అప్పుడెప్పుడో బిగ్ బి ఇంట్లో జరిగిన రచ్చ నుంచి ఇప్పుడు ఐష్, అభి విడాకుల దాకా సస్పెన్స్ కొనసాగుతోంది. 3,190 కోట్ల ఆస్తికి యజమాని అయిన అమితాబ్ బచ్చన్ తన జుహు ప్రతీక్ష బంగ్లాను కుమార్తె శ్వేతా నందాకు గత ఏడాది బహుమతిగా ఇచ్చారు. దీని తర్వాత బచ్చన్ కుటుంబంలో విభేదాలు వెలుగులోకి వచ్చాయి.

ఐశ్వర్య అభిషేక్ ఠ మాత్రమే కాకుండా తన అత్తగారితో కూడా గొడవ పడ్డారని తెలుస్తోంది. ఇటీవల ఆమె అంబానీ పెళ్ళిలో కూడా బచ్చన్ ఫ్యామిలీతో కలిసి కన్పించలేదు. బచ్చన్ కుటుంబం ఎంట్రీ ఇచ్చిన కొన్ని గంటల తర్వాత, ఐశ్వర్య రాయ్ తన కుమార్తె ఆరాధ్యతో కనిపించింది. మొత్తానికి ఆమె బచ్చన్ కుటుంబానికి గత కొన్ని రోజులుగా దూరంగా ఉంటూ రావడం అనుమానాలకు తెర తీసింది. ఆ వార్తలకు ఆజ్యం పోసే విధంగా తాజాగా అభి ‘గ్రే డివోర్స్’ పోస్ట్ ను లైక్ చేశాడు. దీంతో బచ్చన్ ఇంట్లో చాలా విభేదాలు ఉన్నాయని, దీనంతటికీ కారణం ఓ హీరోయిన్ అంటున్నారు నెటిజన్లు. ఆమె మరెవరో కాదు బిగ్ బీ మాజీ లవర్ రేఖ. సినీయర్ నటి రేఖ, అమితాబ్ బచ్చన్ మాజీ ప్రేమికులు అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే రేఖ, జయల మధ్య పోరు కూడా. అయితే ఇప్పుడు ఐశ్వర్యారాయ్ రేఖతో సన్నిహితంగా ఉండటమే బచ్చన్ ఫ్యామిలీ మధ్య గొడవకు కారణమని అంటున్నారు.

- Advertisement -

న్యూస్18 కన్నడ

శత్రువుకు శత్రువు మిత్రుడు

ప్రస్తుతం బచ్చన్ ఫ్యామిలీలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఈ సామెత నిజం అన్పిస్తోంది. అంబానీ పెళ్ళిలో ఐష్ తన అత్త జయ బచ్చన్‌ను కలవలేదు. కానీ సీనియర్ నటి రేఖను ప్రేమతో ముంచెత్తింది. ఇద్దరూ కలుసుకుని ఆలింగనం చేసుకోవడమే కాకుండా ఒకరి చెవుల్లో ఒకరు గుసగుసలాడుకున్నారు. ఐశ్వర్య, రేఖ కలిసి కనిపించడం ఇదే మొదటిసారి కాదు. 2019లో ఉర్దూ కవి కైఫీ అజ్మీ 100వ జయంతి సందర్భంగా ఇద్దరూ చేయి చేయి పట్టుకుని నడిచారు. ఇదంతా చూస్తుంటే బచ్చన్ ఫ్యామిలీకి రేఖ విలన్ అని నెటిజన్లు అంటున్నారు.

న్యూస్18 కన్నడ

కాగా కొన్ని సంవత్సరాల డేటింగ్ తర్వాత ఐశ్వర్య, అభిషేక్ 2007 ఏప్రిల్ 20న వివాహం చేసుకున్నారు. ‘ధై అక్షర్ ప్రేమ్ కే’ తర్వాత వీరిద్దరూ ‘ఉమ్రావ్ జాన్’లో కూడా కనిపించారు. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఈ జంటకు ఆరాధ్య అనే పాప కూడా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు