Aishwarya Rai – Abhishek Bachchan: విడాకులకు సిద్ధం.. పోస్ట్ వైరల్..!

Aishwarya Rai – Abhishek Bachchan: మాజీ విశ్వసుందరి బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ నుంచి విడాకులు తీసుకోబోతోంది అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ వార్తలు మరింత బలంగా వినిపిస్తున్నాయి.. అయితే ఇందుకు గల కారణాలు కూడా లేకపోలేదు.. పలు ఈవెంట్లలో ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి దర్శనమిస్తోంది. కానీ అభిషేక్ బచ్చన్ ఎక్కడ కనిపించలేదు.. పైగా ఇటీవల జరిగిన అనంత అంబానీ పెళ్లిలో కూడా ఐశ్వర్యరాయ్ తన కూతురు ఆరాధ్యతో కనిపించడంతో ఈ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి.

Aishwarya Rai - Abhishek Bachchan: Prepare for Divorce.. Post Viral..!
Aishwarya Rai – Abhishek Bachchan: Prepare for Divorce.. Post Viral..!

విడాకుల పోస్ట్ కు అభిషేక్ లైక్..

ఇక దీంతో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ కాగా.. తాజాగా అభిషేక్ బచ్చన్ చేసిన మరో పనికి విడాకులకు ఇక పూర్తిగా సిద్ధం అయ్యారని తెలుస్తోంది. తాజాగా విడాకుల రూమర్స్ మధ్య అభిషేక్ బచ్చన్ విడాకులకు సంబంధించిన పోస్ట్ పై స్పందించడంతో..కొందరు నిజంగానే ఐశ్వర్య , అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారని దానికి క్లారిటీ ఇదే అని సోషల్ మీడియాలో తెగ వార్తలు వైరల్ చేస్తున్నారు.

విడాకుల రూమర్స్ నిజమే అంటున్న నెటిజన్స్..

తాజాగా ఇంస్టాగ్రామ్ లో గ్రే డివోర్స్ కి సంబంధించిన ఒక పోస్టును అభిషేక్ బచ్చన్ లైక్ చేశారు.. ఆ పోస్ట్ లో ఏముందంటే విడాకులు ఎవరికీ అంత సులభం కాదు.. వృద్ధ దంపతులు వీధి దాటుతున్నప్పుడు చేతులు పట్టుకొని ఉన్న వీడియోలు మన మనసును కదిలిస్తాయి.. కొంతమంది అలాంటి కలలు కనేవారు కానీ ప్రస్తుతం చాలామంది కపుల్స్ విడిపోతున్నారు. చిన్న చిన్న విషయాల వల్ల వారు తమ బంధాన్ని వదులుకోవడానికి సిద్ధమవుతున్నారు.. అయితే విడాకులు తీసుకోవడానికి వారిని ఏది ప్రేరేపిస్తుంది.. వారు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు.. వంటి ప్రశ్నలు, సమాదాలన్నీ కూడా ఉన్నాయి..

- Advertisement -

గ్రే డివోర్స్ అంటే ఏంటి..?

అయితే ఈ గ్రే డివోర్స్ అంటే ఏమిటి అంటే.. సాధారణంగా 50 ఏళ్లు కలిసి ఉండి.. ఆ తర్వాత వివాహం రద్దు చేసుకొని ..విడాకులు తీసుకోవాలనుకునే వారు ఈ కోవకు చెందుతారు. వారికి సంబంధించిన నిబంధనలు, వారు విడాకులు తీసుకోవడానికి గల కారణాలు, అన్నింటిలో కూడా ఈ పోస్టులో పొందుపరిచి ఉన్నాయి.. ఈ పోస్టును అభిషేక్ బచ్చన్ లైక్ చేయడంతో విడాకులు రూమర్స్ కు మరింత అజ్యం పోసినట్లు అయింది. దీంతో నిజంగానే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు.. అందుకే ముందుగానే క్లారిటీ ఇచ్చారా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. మరి దీనిపై నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.. మొత్తానికైతే అభిషేక్ బచ్చన్ చేసిన ఈ ఒక్క చిన్న పని వీరిద్దరి మధ్య విడాకుల రూమర్స్ కు ఆజ్యం పోసింది.. మరి దీనిపై అభిషేక్ బచ్చన్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇక అభిషేక్ బచ్చన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సుహానా ఖాన్ లీడ్ రోల్ పోషిస్తున్న ఒక చిత్రంలో విలన్ గా నటించబోతున్నట్లు సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by Heena Khandelwal (@heenakhandlwal)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు