AishwaryaRajesh : ఎన్ని ఆఫర్లొచ్చినా.. ఆ టైపు సినిమాలే చేస్తుందట!

AishwaryaRajesh : తెలుగమ్మాయి ఐశ్వ‌ర్యా రాజేష్ గురించి ప్రత్యేకంగా పరిచ‌యం అవ‌స‌రం లేదు. నటుడు రాజేష్ కూతురుగా తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ అక్కడ సక్సెస్ అయి ‘కౌస‌ల్య కృష్ణమూర్తి’ అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన నటనతో మెప్పించినా సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అయితే అంతకు ముందే డబ్బింగ్ సినిమాల ద్వారా ఆడియన్స్ ని పలకరించింది. డబ్బింగ్ సినిమాలతో సక్సెస్ కొట్టిన ఐశ్వర్య తెలుగులో మాత్రం విజయం అందుకోలేదు. చివరగా రిపబ్లిక్, టక్ జగదీష్ సినిమాల్లో నటించగా, ఆ సినిమాలు నటిగా ఐశ్వర్యకు మంచి పేరు తీసుకొచ్చాయి. కానీ సక్సెస్ మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు మూడేళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ స్ట్రెయిట్ తెలుగు సినిమా లో నటిస్తుంది ఐశ్యర్య.

Aishwarya Rajesh about upcoming movies

ఆ టైపు సినిమాలే చేస్తాను – ఐశ్వర్య..

అయితే గత కొన్నాళ్లుగా ఐశ్వర్య రాజేష్ కెరీర్ ఆశించిన విధంగా సాగ‌డంలేదు. తమిళ్ లో కూడా వరుస సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయితే అవకాశాలకేమి కొదవలేదు. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకువెళ్తుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తన సినిమాల గురించి అనుభవాలని పంచుకుంది. అయితే ఐశ్వర్యరాజేష్ కెరీర్ ముందు నుండి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడూ కొన్ని షాట్స్ లో కథ డిమాండ్ ని బట్టి కాస్త గ్లామర్ గా కనిపించిందన్న మాటే గాని, ఎక్స్ పోజింగ్ చేసే పాత్రలు చేయలేదు. ఇదే విషయాన్నీ ఐశ్యర్య చెప్పుకొచ్చింది. తనకు గ్లామర్ షో ప్రాధాన్యమున్న పాత్రలు అవకాశాలు చాలా వస్తున్నాయని, కానీ ఎన్ని అవకాశాలు వచ్చినా తాను ఆ పాత్రలు చేయనని చెప్పుకొచ్చింది.

- Advertisement -

వెంకీ సరసన తెలుగులో…

ఇక ఐశ్వర్య నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తానని, తనకు ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ పాత్రలే ఇష్టమని, అలాంటి ఫ్యామిలీ టైపు పాత్రలే చేస్తానని చెప్పుకొచ్చింది. పైగా తన ఏజ్ కి, తన కుటుంబానికి వ్యక్తిత్వానికి విలువిచ్చే పాత్రలే చేస్తానని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. ఇక ఐశ్యర్య ప్రస్తుతం తెలుగులో వెంకటేష్ సరసన అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఐశ్యర్య వెంకటేష్ భార్య పాత్రలో నటిస్తుండగా, ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక కన్నడలో ఉత్తరాకాండ సినిమాలో నటిస్తుండగా, తమిళ్ లో మరో మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు