Akhanda 2: థమన్ ను తప్పించి ఆ మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకుంటున్నారు.?

Akhanda 2: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ ఒకటి. బోయపాటి శ్రీను ఎంతమందితో సినిమాలు చేసినా కూడా బాలకృష్ణతో సినిమా అంటేనే ఒక హై ఉంటుంది. ఎందుకంటే బాలకృష్ణని ఎలా చూపించాలో ఎలా చూపిస్తే ప్రేక్షకులు ఇష్టపడతారు అనేదాంట్లో పిహెచ్డి చేశాడు అనే విధంగా సినిమాను తెరకెక్కిస్తుంటాడు. భద్ర సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన బోయపాటి శ్రీను తన కెరీర్ లో ఎన్నో హిట్స్ సినిమాలు చేశాడు. అయితే బాలకృష్ణ తో చేసిన సినిమాలు మాత్రం మంచి పేరును తీసుకొచ్చాయి.

సింహా సినిమాతో మొదలైన కాంబినేషన్

ఆల్మోస్ట్ బాలకృష్ణ కెరియర్ ముగిసిపోతుంది అనుకున్న టైంలో శ్రీను దర్శకత్వంలో సింహా అనే సినిమాను చేశాడు బాలయ్య. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత బాలయ్య వరుస సినిమాలకు సైన్ చేసాడు. మరోవైపు బోయపాటి శ్రీను కూడా ఫుల్ బిజీ అయిపోయాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి లెజెండ్ అనే మరో సినిమా చేశారు. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. బాలకృష్ణను రెండు పాత్రలలో చూపించి బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన అఖండ సినిమా గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ఆ సినిమాలో బయటపెట్టాడు బోయపాటి. అలానే థమన్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకి మంచి ప్లస్ అయింది.

అఖండ స్ట్రాంగ్ కం బ్యాక్

బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తున్న కూడా అవి బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతూ వస్తున్నా. అయితే బాలకృష్ణకి అన్ స్టాపబుల్ అనే షో కూడా చాలా పెద్ద ప్లస్ అయింది. అంతకు ముందు బాలయ్య తీరు చాలామందికి నెగిటివ్ ఇంప్రెషన్ తీసుకొస్తే, ఈ షో మాత్రం బాలయ్య లోని అసలైన వ్యక్తిత్వాన్ని బయటపెట్టింది. వ్యక్తులతో మాట్లాడే విధానం. వాళ్లతో మాట్లాడే తీరు ఇవన్నీ కూడా బాలకృష్ణకి ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని తీసుకొచ్చి పెట్టాయి. అదే అఖండ సినిమాకి కూడా ఒక రకంగా ప్లస్ అయిందని చెప్పొచ్చు.

- Advertisement -

Akhanda

థమన్ ను తప్పించారు

బోయపాటి శ్రీను తో బాలకృష్ణ చేయబోయే సినిమాను ఇదివరకే అనౌన్స్ చేశారు. ఈ సినిమాను 14 రీల్స్ సంస్థ నిర్మించనుంది. హ్యాట్రిక్ సూపర్ హిట్ వచ్చిన ఈ కాంబినేషన్లో 4వ సారి సినిమా రాబోతుండడంతో దీనిపై కూడా అంచనాలు తారస్థాయిలో చేరాయి. ఇకపోతే ఈ సినిమాకి కూడా థమన్ సంగీతం అందిస్తాడు అనుకున్నారు. కొన్ని కారణాల వలన ఈ సినిమా నుంచి థమన్ ను తప్పించి అనిమల్, అర్జున్ రెడ్డి వంటి సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ను ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గాను తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి ఇంకా అధికార ప్రకటన రాలేదు. ఇకపోతే సందీప్ రెడ్డి వంగ కి ఉన్న మ్యూజిక్ పై అవగాహన వలన మంచి మ్యూజిక్ ను హర్షవర్ధన్ నుంచి రాబట్టుకోగలిగాడు సందీప్. అది బోయపాటికి సాధ్యమవుతుందా లేదా చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు