Adipurush: టాలీవుడ్ ఆశలన్నీ ఆ సినిమాపైనే..!

తెలుగు సినిమాలకు సంక్రాంతి మోస్ట్ అవైటెడ్ సీజన్ అయితే, ఆ తర్వాత సమ్మర్ సీజన్ కూడా అలాంటిదే అని చెప్పవచ్చు. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి లాంటి పెద్ద సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్స్ గా నిలిచి సందడి చేశాయి. అయితే సమ్మర్ సీజన్ లో  దసరా, విరూపాక్ష లాంటి మీడియం రేంజ్ సినిమాలు మినహా ఒక్క పెద్ద సినిమా కూడా విడుదల కాలేదు. రిలీజ్ అయిన చిన్న చితకా సినిమాలు కూడా పెద్దగా అలరించలేకపోయాయి. దీంతో సినీ ప్రేమికులకు ఈ వేసవి వినోదాన్ని అందించలేకపోయింది. అయితే, వేసవి ముగిసే సమయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుడి ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు, సెలవుల సీజన్ కావటంతో ఇంటిల్లిపాది వెళ్లి చూడగలిగే మైథలాజికల్ జానర్లో వస్తున్న ఆదిపురుష్ సినిమా కోసం ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

భారీ బడ్జెట్ తో రూపొందిన ఆదిపురుష్ సినిమాకు బిజినెస్ కూడా అంతే రేంజ్ లో జరుగుతోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కే 185కోట్లకు డీల్ సెట్ చేసుకుంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ. దీన్ని బట్టి చూస్తే, ఓపెనింగ్స్ కూడా హై రేంజ్ లో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, పాటలు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. టీజర్ రిలీజ్ అయిన సమయంలో వచ్చిన నెగిటివిటీ అంతా ట్రైలర్ రిలీజ్ అయ్యాక తుడిచిపెట్టుకుపోయింది. ఆదిపురుష్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని కూడా భారీ స్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సమ్మర్ సీజన్ ముగిసే సమయంలో సందడి మొదలైంది.

ప్రభాస్ సరసన కృతి సనన్ సీత పాత్రలో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జూన్ 16న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు అనుకున్న స్థాయిలో అలరించకపోవడం వల్ల ప్రభాస్ కి ఈ సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. మరో పక్క టాలీవుడ్లో వేసవికి సరైన హిట్ లేకపోవటంతో అందరి దృష్టి ఆదిపురుష్ సినిమా మీదనే ఉంది. ఈ క్రమంలో సమ్మర్ కి సరైన హిట్ లేక బోసిపోయిన టాలీవుడ్ కి ఆదిపురుష్ సినిమా బ్లాక్ బస్టర్ అందిస్తుందో లేదో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు