Rajinikanth: నా ఆస్తి మొత్తం వాళ్లకే.. షాక్ లో కుటుంబీకులు..!

Rajinikanth

సౌత్ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ ఒక్క ఇండియాలోనే కాదు జపాన్ లో కూడా భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీకి చెందిన వారైనప్పటికీ కూడా తెలుగులో ఈయనకి మంచి పేరు ప్రఖ్యాతలు లభించాయి. ముఖ్యంగా రజనీకాంత్ అంటే భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆదరిస్తారు. కోట్లాదిమంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న ఈయన తాజాగా జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లాల్ సలాం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు..

రజినీకాంత్ వ్యక్తిగత జీవిత విషయానికొస్తే.. ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఆత్మాభిమానాన్ని చాటుకున్న ఈయన ఎక్కువగా భక్తి మార్గంలో నడుస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక్క భక్తి మార్గమే కాదు ఇతరులకు సహాయం చేయడంలో కూడా ముందుంటారు.. అందుకే ఎన్నో సినిమాల ద్వారా సంపాదించుకున్న ఆస్తిపాస్తులను తమ కూతుర్లకి , అల్లుడికి ఇవ్వకుండా పేద ప్రజలకు దక్కేటట్లుగా వీలునామా రాసిచ్చారు.. జనాల నుంచి తాను సంపాదిస్తున్న డబ్బు మళ్ళీ జనాలకే వెళ్లాలనే మంచి సంకల్పంతో ఈ పని చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ సంపాదించే డబ్బు మొత్తం అనాధాశ్రమాలకు అలాగే చారిటీలకు చెందాలని ఆయన అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

చేసే మంచి కనిపించాలి కానీ మనిషి కనిపించక్కర్లేదు అనే డైలాగ్ ని ఫాలో అవుతున్నారు. అందుకే సూపర్ స్టార్ చేసే సామాజిక సేవా కార్యక్రమాల గురించీ ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క అభిమాని కూడా ఆయనను దైవంగా భావిస్తున్నారు. డబ్బుకోసం హత్యలు కూడా చేసే మన దేశంలో ఇలా తన ఆస్తిని మొత్తం పేద ప్రజలకు రాయడం అంటే మామూలు విషయం కాదు.. ఇలాంటి గొప్ప ఆలోచనలు గొప్పవాళ్ళకే వస్తాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా రజినీకాంత్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారని చెప్పవచ్చు.

- Advertisement -

ఇక రజనీకాంత్ విషయానికి వస్తే.. బస్ కండక్టర్గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత పలు నాటకాలు వేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఆ తర్వాత కాలంలో సినిమాలలో అవకాశాలు దక్కించుకొని అంచలంచెలుగా ఎదిగి నేడు సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్నారు. జపాన్లో కూడా తన సినిమాలతో అక్కడి ప్రేక్షకులను అలరిస్తున్నారు రజినీకాంత్.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు