Allu Arjun: హీరోయిన్ పై మోజు పడ్డ బన్నీ.. అందుకే ఏకంగా మూడుసార్లు..?

Allu Arjun.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో పుష్ప(Pushpa ) సీక్వెల్ పుష్ప2 (Pushpa -2) సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను డిసెంబర్ 6వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇదివరకే చిత్ర బృందం ప్రకటించింది ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్ , పోస్టర్ అన్నీ కూడా సినిమాపై హైప్ పెంచేసాయి. ఇదిలా ఉండగా మరొక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయనతో సినిమాలు చేయడానికి చాలామంది హీరోయిన్లు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం ఏకంగా ఈయనతో మూడు సినిమాలు చేసి, కొత్త రూమర్స్ కి చోటు ఇచ్చిందని చెప్పవచ్చు.

Allu Arjun: Bunny who fell in love with the heroine.. that's why three times at once..?
Allu Arjun: Bunny who fell in love with the heroine.. that’s why three times at once..?

హీరోయిన్ పై మనసు పారేసుకున్న ఐకాన్ స్టార్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మెగా ఇమేజ్ తో ఇండస్ట్రీలోకి వచ్చి , తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈయన టాలీవుడ్ యూత్ కి స్టైలిష్ ఐకాన్ గా నిలిచాడు. ముఖ్యంగా బన్నీ బ్రాండ్ అంటే అంతా కాదు . ఈయన అంటే ఫ్యాన్స్ పడి చావడమే కాదు లేడీ ఫ్యాన్స్ అయితే ఈయన మాట చెప్పగానే మెలికలు తిరిగిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఎంతో మంది హీరోయిన్లు బన్నీతో కలిసి నటించాలని తాపత్రయ పడుతూ ఉంటారు.అయితే ఆయన మాత్రం తన కెరీర్లు ఒక హీరోయిన్ పై మనసు పారేసుకుని, ముచ్చట పడ్డారట. అంతేకాదు ఆమెకు ఏకంగా తన మూడు సినిమాలలో అవకాశం కల్పించారు. మరి ఆమె ఎవరో కాదు కేథరిన్ థ్రెసా (Catherine tresa).

ఏకంగా మూడు సినిమాలలో అవకాశం..

నిజంగా ఈమె బన్నీతో ఏకంగా మూడు సినిమాలలో నటించింది. వరుణ్ సందేశ్ తో కలిసి చమ్మక్ చల్లో సినిమాలో నటించిన ఈమె.. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన ఇద్దరమ్మాయిలతో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా తర్వాత ఈమెకు వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ఆ తర్వాత సరైనోడు సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ గానే అవకాశం ఇచ్చారు బన్నీ. అంతేకాదు రుద్రమదేవి సినిమాలో కూడా గోనగన్నారెడ్డి పాత్రలో బన్నీ నటించగా, ఆయనకు జోడిగా అన్నాంబిక పాత్రలో ఈమె నటించింది. ఇలా మూడు సినిమాలలో అవకాశం కల్పించడమే కాదు మూడు సినిమాలలో కూడా సెకండ్ హీరోయిన్ గా అవకాశం కల్పించడం నిజంగా ఆశ్చర్యకరం అనేది చెప్పాలి. ఇక ఈ విషయాలు తెలిసి చాలా మంది బన్నీకి కేథరిన్ అంటే ఇష్టం .అందుకే మూడుసార్లు అవకాశం ఇచ్చాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

కేథరిన్ కెరియర్..

ఇక కేథరిన్ విషయానికి వస్తే.. తెలుగులో వరుస సినిమాలు చేసిన ఈమె పైసా, నేనే రాజు నేనే మంత్రి, వదలడు, గౌతమ్ నందా, వరల్డ్ ఫేమస్ లవర్, బింబిసారా వంటి చిత్రాలలో నటించింది. అయితే అన్ని చిత్రాలలో కూడా చాలా వరకు సెకండ్ హీరోయిన్ గానే నటించడం గమనార్హం.

అల్లు అర్జున్ సినిమా..

ఇక ప్రస్తుతం బన్నీ విషయానికి వస్తే పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు