Allu Arjun VS Pawan Kalyan : కాపాడండి మహాప్రభో… క్షమించండి అంటూ కాళ్ళ బేరానికి వచ్చేస్తున్న బన్ని

Allu Arjun VS Pawan Kalyan :ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మాటలు లేవని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.. దీనిపై మెగా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ జరుగుతున్న సంగతి అందరికీ తెలుసు.. ఏపీలో ఎన్నికల్లో భాగంగా అల్లు అర్జున్ సొంత మామను కాకుండా వేరే వారిని సపోర్ట్ చేస్తూ ప్రచారం చెయ్యడమే అందుకు కారణం.. పవన్ కళ్యాణ్ డీప్యూటీ సీఎం అయిన తర్వాత బన్నీ మామకు విషెస్ కూడా తెలపలేదు.. కనీసం ఎక్కడా కలవలేదు.. దాంతో ఈ వార్తలు నిజమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు..

ఈ వార్తలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి.. ఇక బన్నీ పై మెగా ఫ్యాన్స్ దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు.. కానీ బన్నీ ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు.. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ను బన్నీ ప్రత్యేకంగా కలబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి.. అల్లు అరవింద్ రిక్వెస్ట్ తో స్వయంగా చిరంజీవి దిగి ఇద్దరినీ కలిపే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.. పవన్ ను కలమని మెగాస్టార్ చిరంజీవి బన్నీకి ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తుంది.. అంతేకాదు చిరు మళ్లీ ఇరు కుటుంబాలు కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది… ఈ క్రమంలో బన్నీ, డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ ను రేపు కలబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దీక్షలో ఉన్న నేపథ్యంలో వీరిద్దరు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తుంది.. పవన్ కు కోపం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టే ఈ వార్తలు నిజం అని బన్నీ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఈ భేటీ గురించి అప్డేట్ వచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..

Allu Arjun is going to meet Pawan Kalyan
Allu Arjun is going to meet Pawan Kalyan

పవన్ కళ్యాణ్ తెలుగు నిర్మాతలు అందరు ఇటీవల కలిసి సినిమా ఇండస్ట్రీ కష్ఠాలను గురించి చెప్పుకున్నారు.. అందులో అల్లు అరవింద్ కూడా ఉన్నారు.. మరి ఈ భేటీ గురించి బన్నీ టీమ్ కూడా స్పందించలేదు.. దాంతో ఇది నిజమే అని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బన్నీ, సుకుమార్ కాంబోలో పుష్ప సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది…

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు