AlluArjun : అందరూ బిజీ.. మళ్ళీ గురూజితోనే కలవనున్నాడా?

AlluArjun : టాలీవుడ్ లో ప్రస్తుతం అందరు స్టార్ హీరోలు బిజీగా ఉన్నారు. ప్రభాస్ నాలుగు సినిమాలో లైన్లో పెట్టగా, మహేష్ జక్కన్నతో బిజీ అవనున్నాడు. రామ్ చరణ్ రెండు ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు. అలాగే తారక్ కూడా మూడు సినిమాలు లైన్లో పెట్టాడు. ఇక పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చేస్తున్న మూడు సినిమాలే రిలీజ్ కి నోచుకోవడం లేదు. అవి పూర్తి చేయడమే పెద్ద పని. ఇక మిగిలిన స్టార్ హీరో అల్లు అర్జున్. బన్నీ మూడేళ్ళుగా పుష్ప ది రూల్ పైనే ఫోకస్ పెట్టాడని తెలిసిందే. మూడేళ్ళ కింద పుష్ప తో బ్లాక్ బస్టర్ కొట్టాక, దాని రెండో పార్ట్ పైనే మొత్తం టైం కేటాయించాడు. ఆ సినిమా కోసం మిగతా ఎవరి ప్రాజెక్ట్ ని కూడా అల్లు అర్జున్ మొదలు పెట్టలేదు. ఇప్పుడు అది కూడా పూర్తి కావచ్చింది. డిసెంబర్ లో పుష్ప2 విడుదల కాబోతుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ (AlluArjun) ఎవరితో సినిమా చేస్తాడన్న ప్రశ్న ఎదురైంది.

AlluArjun Next Movie with Trivikram Srinivas

బన్నీ నెక్స్ట్ ఎవరితో?

ఇక అల్లు అర్జున్ పుష్ప2 తరవాత ఎవరితో చేస్తాడు అన్న ప్రశ్న ఎదురవగా, మొన్నటివరకు అట్లీ తో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ అట్లీ తో సినిమా క్యాన్సిల్ అయ్యిందని టాక్ నడుస్తుంది. మరి అట్లీ తో క్యాన్సిల్ అయితే ఎవరితో చేస్తాడని అనుకుంటుండగా, ఎంతో మంది యువ దర్శకులు కూడా లైన్లో ఉన్నారని వార్తలు వస్తుండగా, చాలా మంది మాత్రం ఓ స్టార్ డైరెక్టర్ ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడని టాక్ నడుస్తుంది. ఆయనెవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అవును పుష్ప2 తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ గురుజీనే నమ్ముకున్నాడని వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

మళ్లీ గురుజీనే నమ్ముకున్నాడా?

పుష్ప2 తరవాత అల్లు అర్జున్ మళ్ళీ గురుజీనే నమ్ముకున్నాడని వార్తలు ఊపందుకున్నాయి. ఇప్పటికే వీళ్ళ కాంబోలో వచ్చిన జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు నాలుగోసారి కలవనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక వీరి కాంబోలో నాలుగో సినిమా ఏడాదిన్నర కిందే అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఆ ప్రాజెక్ట్ ని పక్కన బెట్టారు. ఇప్పుడు పుష్ప2 తర్వాత అల్లు అర్జున్ మళ్ళీ స్టార్ డైరెక్టర్ తోనే చేయాల్సిన అవసరం ఉంది. తెలుగులో స్టార్ డైరెక్టర్లు అందరూ బిజీ అయిపోయారు. అందుకే మళ్ళీ గురుజీ తోనే సినిమా చేయనున్నాడని టాక్ నడుస్తుంది. అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా మొదలవుతుందా లేదా అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు