Amala Paul : అజయ్ దేవగన్ దర్శకత్వంలో ?

దాదాపు సౌత్ ప్రేక్షకులందరికీ  పరిచయం అక్కర్లేని పేరు అమలాపాల్. ఈమె తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించింది. చివర గా ‘పిట్టకథలు’ అనే చిత్రంలో కనిపించింది. దీని తర్వాత తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాలకు సైన్ చేసింది. వీటితో పాటు బాలీవుడ్ లో కూడా సినిమా చేయడానికి సిద్ధమైపోయింది ఈ బ్యూటీ. అజయ్ దేవగన్ నుంచి వస్తున్న కొత్త చిత్రం భోళాలో అమల పాల్ నటించనున్న‌ట్టు అధికారిక ప్రకటన వచ్చింది.

కాగా తమిళంలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ చిత్రానికి అధికారిక రీమేక్ గా భోళా చిత్రం వస్తుంది. దీనికి అజయ్ దేవగన్ దర్శకత్వం వహించనున్నాడు. గతంలో అజయ్ దేవగన్ మూడు చిత్రాలకు దర్శకత్వం చేశాడు. ఇప్పుడు భోళాతో ఈ సంఖ్య నాలుగుకు చేరింది. భోళా చిత్రంలో అజయ్ దేవగన్ తో పాటు టబు కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఇక వీరితో పాటు అమలపాల్ కీలక పాత్రలో కనిపించబోతుంది. అదేవిధంగా అజయ్ దేవగన్ నటిస్తున్న దృశ్యం-2 లో కనిపించే పలువురు నటీ నటులు భోళా చిత్రంలో కూడా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా విడుదల తేదీపై చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమా ఎప్పుడు విడుద‌ల‌వుతుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు