Amala Paul : సౌత్ హీరోయిన్ అమలా పాల్ ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ కవలలకు జన్మనిచ్చిందని ఇంటర్నెట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాని అసలు కథ ఏంటో చూద్దాం.
కవల పిల్లలా?
నిండు గర్భిణి అయిన అమలా పాల్ అప్పుడప్పుడు ప్రెగ్నెన్సీ ఫోటో షూట్ చేస్తూ తన ఫోటోలను పోస్ట్ చేస్తూనే ఉంది. కాగా నిన్న సాయంత్రం అమలా పాల్ కవలలకు జన్మనిచ్చిందనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. దీంతో ఆమెకు అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ఈ విషయాన్ని అమలా, జగత్ దంపతులు ఇంకా సోషల్ మీడియా వేదికగా ప్రకటించక పోవడంతో కన్ఫ్యూజన్ నెలకొంది.
అసలు నిజం ఏంటంటే?
అయితే తాజా సమాచారం ప్రకారం అవన్నీ రూమర్లు అని తేలింది. నిజానికి అమలా పాల్ ఇంకా బిడ్డకు జన్మనివ్వలేదు. దీంతో ఆమె కవలలకు జన్మనిచ్చినట్లు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న సమాచారం ఏమాత్రం నిజం కాదని తెలుస్తోంది. కాగా అమలా పాల్ నిండు గర్భిణీ అయినప్పటికీ హుషారుగా వీడియోలు, ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అవి చూసిన అమల అభిమానులు ఈ జంట కలకాలం ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు.
మొదటి పెళ్లి పెటాకులు
కోలీవుడ్ ప్రముఖ నటి అమలా పాల్ విభిన్నమైన సినిమాలు చేస్తూ సౌత్ లో మంచి నటిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. మైనా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు విజయ్, ధనుష్, సూర్య, జయం రవి వంటి ప్రముఖ స్టార్ హీరోలతో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. సినీరంగంలో అగ్ర నటిగా ఉంటూనే దర్శకుడు ఏఎల్ విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే అమలా పాల్ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తి 2017లో విడాకులు తీసుకుని విడిపోయారు.
గతేడాది రెండో పెళ్లి
ఏఎల్ విజయ్‌తో విడాకుల తర్వాత సినీరంగంపై పూర్తిగా శ్రద్ధ పెట్టిన నటి అమలా పాల్ రత్నకుమార్ దర్శకత్వంలో వచ్చిన అవసాయ్ సినిమాలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది. ఆ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. బాగానే ఆడింది కూడా. కానీ ఆ తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో తెలుగు, మలయాళం, హిందీ వంటి ఇతర భాషల చిత్రాలపై దృష్టి సారించిన అమలా పాల్ అడపా దడపా సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గతేడాది రెండో పెళ్లి చేసుకుంది.
ప్రియుడి పరిచయం..
గతేడాది తన పుట్టినరోజున ప్రియుడు జగత్ దేశాయ్ ని పరిచయం చేసిన అమలా పాల్ నవంబర్‌లో అతడిని పెళ్లి చేసుకుంది. కానీ నెక్స్ట్ రెండు మూడు నెలలలోనే అంటే జనవరిలో జగత్ దేశాయ్, అమలా పాల్ తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. ఇక అమలా పాల్ గర్భవతిగా ఉన్న సమయంలో కూడా తన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. రీసెంట్గా ఆమె పృథ్వీరాజ్ సరసన నటించిన ఆడుజీవితం మూవీతో భారీ విజయాన్ని అందుకుంది.