Amithabh bachchan: కల్కి మూవీ కోసం.. అమితాబ్ బచ్చన్ కష్టాలు..!!

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వయసుతో సంబంధం లేకుండా ఎన్నో చిత్రాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.. కుర్ర హీరోలకు ధీటుగా తన సినిమాలను విడుదల చేసి మంచి విజయాలను అందుకుంటున్నారు.. అలాగే ఎన్నో చిత్రాలలో కూడా కీలకమైన పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు అమితాబ్ బచ్చన్.. ప్రస్తుతం వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్న అమితాబ్ కల్కి 2898AD అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు.. ఈ సినిమాను మే 9వ తేదీన థియేటర్లో విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

కల్కి నుంచీ అమితాబ్ లుక్..
ప్రస్తుత ఈ సినిమా షూటింగ్ కూడా ఇంకా మిగిలి ఉంది.. ఇందుకోసం చిత్ర బృందం గత కొద్ది రోజులుగా ఇటలీలో షూటింగ్ జరుపుకుంటోంది.. ప్రభాస్ , దిశాపటాని లపైన ఒక ప్రత్యేకమైన పాటను కూడా చిత్రీకరించారు.. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నది.. ఇకపోతే అమితాబ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ని షేర్ చేయగా ఆ సమయంలో అమితాబ్ బచ్చన్ ఈ చిత్రానికి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ ను కూడా ఇచ్చారు.. ఇందులో కమలహాసన్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. చాలామంది స్టార్స్ సైతం అతిథి పాత్రలో నటించబోతున్నారు.

అప్డేట్ ఇచ్చిన అమితాబ్..
ప్రభాస్ పాత్ర కి సంబంధించిన షూటింగ్ కూడా ఇటీవల పూర్తయినట్లుగా వార్తలు వినిపించాయి.. కల్కి 2898AD సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్లుగా సమాచారం.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం అద్భుతంగా వహిస్తున్నారని.. తాజాగా ఈ సినిమా గురించి అమితాబ్ బచ్చన్ తన అనుభవాన్ని తెలియజేశారు.. ఈ విషయాన్ని తన బ్లాక్ ద్వారా వెల్లడిస్తూ.. నిజానికి ఇందులో నటించే వారందరి షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యిందని.. కానీ అమితాబ్ బచ్చన్ కోసం కొంత భాగం మిగిలి ఉండగా ఇప్పుడు దానిని కూడా ముగించారు.. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు..

- Advertisement -

కల్కి కోసం అమితాబ్ కష్టం..
అమితాబ్ బచ్చన్ బ్లాగ్ లో ఇలా రాసుకుంటూ.. మళ్లీ ఆలస్యం అయ్యింది.. కానీ నేను నిన్ను రాత్రి షూటింగ్ నుంచి ఆలస్యంగా వచ్చాను.. కల్కి 2898AD షూటింగ్ ముగిసింది.. ఈ చిత్రం మే 9న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.. కాబట్టి ప్రతిదీ ఆకృతిని తీసుకురావడానికి చివరి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి.. కానీ ఇప్పుడు నేను వేరే పనికి కూడా వెళ్లాల్సి ఉంది.. అంటే జిమ్ బాడీని యాక్టివేషన్ చేసుకోవడం అవసరం.. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి అవుతుందంటూ వెల్లడించారు..

చివరి దశకు కల్కి..
మేకర్స్ కూడా చిన్న చిన్న పనులను పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారని తెలిపారు అమితాబ్ బచ్చన్.. ప్రభాస్ రూ.600 కోట్ల పిక్చర్ కోసం అర్ధరాత్రి వరకు షూటింగ్ చేయవలసి వచ్చిందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా విడుదలకి తక్కువ సమయం ఉండడం.. పైగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మిగిలి ఉన్న నేపథ్యం లో.. ఈ కొంచెం సమయం లోనే షూటింగ్ తో పాటు ఇతరత్రా పనులు కూడా పూర్తిచేయాలని నటీనటులు రేయింబవళ్ళు కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.. ఇక ఈ విషయాలను స్వయంగా అమితాబ్ బచ్చన్ వెల్లడించడంతో సినిమాపై అంచనాలు కూడా ఇప్పుడు మరింత పెరిగాయి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు