Anant Amabni’s Wedding : జస్టిన్ బీబర్ కు దిమ్మ తిరిగే రెమ్యూనరేషన్… అంబానీతో ఇట్లుంటది మరి

Anant Amabni’s Wedding : అపర కుబేరుడు ముఖేష్ అంబానీ తన కొడుకు అనంత్ అంబానీ పెళ్లిని అంగరంగ వైభవంగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలకు జాతీయ, అంతర్జాతీయ రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులకు జీవితంలో మారిచిపోలేని ట్రీట్ ఇచ్చిన అంబానీ తాజాగా కొడుకు పెళ్లి కోసం ఇంటర్నేషనల్ సింగర్స్ ను రంగంలోకి దించుతున్నారు. అందులో జస్టిన్ బీబర్ కూడా ఒకరు. అయితే ఒక్క సాయంత్రం కోసమే జస్టిన్ కు పారితోషికంగా కోట్లు కుమ్మరిస్తున్నాడట అంబానీ.

జస్టిన్ బీబర్ కు దిమ్మతిరిగే రెమ్యూనరేషన్

భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ ఆయన కుటుంబం ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో ఉంటారు. ఇప్పుడు కూడా అంబానీ కుటుంబం ఒక పెద్ద కారణంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం జూలై 12న జరగనుంది. అనంత్ – రాధికల పెళ్లికి ముందు సన్నాహాలు, ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ లో హాలీవుడ్ సింగర్ జస్టిన్ బీబర్ పాడనున్నారు. అయితే జస్టిన్ బీబర్ కు అనంత్ పెళ్లి వేడుకలో పర్ఫామ్ చేయడానికి 10 మిలియన్ డాలర్లు అంటే 83 కోట్ల రూపాయలు పారితోషికంగా ఇచ్చారట.

అయితే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాలీవుడ్ సింగర్ రిహన్నాను ఆహ్వానించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇందుకోసం ముఖేష్ అంబానీ ఆమెకు 74 కోట్లు చెల్లించారు. అప్పుడు ఎక్కడ చూసినా రిహన్నా గురించే చర్చ నడిచింది ఇప్పుడేమో తాజాగా ఇండియాలో అడుగుపెట్టిన జస్టిన్ బీబర్ గురించే సర్వత్రా చర్చ జరుగుతోంది. జస్టిన్‌ బీబర్‌కి భారత్‌లోనూ అభిమానులు ఉన్నారు.

- Advertisement -

జస్టిన్ బీబర్ సంపద విషయానికొస్తే.. 20 ఏళ్ల వయసులో జస్టిన్ బీబర్ రూ.4 వేల కోట్ల సంపదను సంపాదించాడు. జస్టిన్ బీబర్ ఈవెంట్ల ద్వారా సంవత్సరానికి దాదాపు 500 కోట్లు సంపాదిస్తున్నాడు. ఆయన ఒక్క పర్ఫార్మెన్స్ ఫీజు 20 కోట్ల రూపాయలు. అందుకే ఇప్పుడు అందరి దృష్టి అనంత్ అంబానీ వివాహ వేడుకలో జస్టిన్ బీబర్ సంగీత కచేరీపైనే ఉంది.

Justin Bieber arrives in India to perform at Anant Radhika's Sangeet ceremony - BusinessTodayబాద్ షా పర్ఫార్మెన్స్ కూడా..

ఆంటిలియా హౌస్‌లో జరగనున్న మ్యూజిక్ ఈవెంట్‌లో బాలీవుడ్ ప్రముఖ గాయకుడు, రాపర్ బాద్షా కూడా పాడనున్నారు. రిపోర్ట్స్ ప్రకారం బాద్షా ఒక్కో పాటకు 20 లక్షలు తీసుకుంటాడు. అందుకే ఈ కచేరీలో పాడేందుకు బాద్ షాకు ముఖేష్ అంబానీ ఎంత చెల్లిస్తారన్నది ఇంకా తెలియరాలేదు. బాద్ షా సంపద విజయనికొస్తే రాపర్ మొత్తం ఆస్తి విలువ రూ. 30 కోట్లు. సమాచారం ప్రకారం ప్రతి సంవత్సరం బాద్షా సంపద 1 మిలియన్ పెరుగుతుంది.

ప్రస్తుతం అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి గురించే సర్వత్రా చర్చ జరుగుతోంది. వీరిద్దరి ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లికి ప్రముఖులు ఎవరరెవరు హాజరవుతారనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి. అలాగే ఇంకా ఎవరెవరు మ్యూజికల్ ఈవెంట్ లో పర్ఫార్మెన్స్ ఇస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు