Ananya Nagalla : టాలీవుడ్ లో ఉన్న అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్లలో అనన్య నాగళ్ళ ఒకరు. ఈ మధ్య చాలా మంది తెలుగమ్మాయిలు హీరోయిన్లు గా ఎంట్రీ ఇచ్చినా, అనన్య నాగళ్ళ లా బిజీ మాత్రం అవలేరు. ఎందుకంటే కొందరు హీరోయిన్ల రోల్స్ మాత్రమే చేస్తామని అంటారు. కానీ ఈ భామ హీరోయిన్ గా నటిస్తూనే, పెద్ద సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తూ ఉంది. ప్రస్తుతం తెలుగు హీరోయిన్లలో బిజీ గా ఉన్న భామల్లో అనన్య ఒకరయింది. అయితే కెరీర్ మొదట్లో మంచి సినిమాలు చేసినప్పటికీ, ఇప్పుడు స్క్రిప్ట్ సెలెక్షన్స్ పరంగా అంతగా ఫోకస్ చెయ్యట్లేదు. ఇక అనన్య కెరీర్ సోసోగా సాగుతోన్న సంగతి తెలిసిందే. ‘మల్లేషం’ నుంచి మొన్నటి అన్వేషి వరకూ ఆరేడు సినిమాలు చేసింది. అయితే వీటిలో పెద్ద చిత్రం ‘వకీల్ సాబ్’. అందులో అమ్మడు ఓ కీలక పాత్ర పోషించింది. కానీ కెరీర్ పరంగా అది పెద్దగా కలిసి రాలేదు. ‘మల్లేషం’ ఇమేజ్ తోనే అవకాశాలు అందుకుంది. రీసెంట్ గా తంత్ర సినిమాతో ప్లాప్ అందుకుంది అనన్య. ప్రస్తుతం అమ్మడు ‘పొట్టేలు’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉండగా అనన్య నాగళ్ళ నుండి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది.
ఈ హిందీ చిత్రానికి రచయిత గా పనిచేసిన అనన్య..
హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తున్న అనన్య నాగళ్ళ (Ananya Nagalla) గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. “మల్లేశం” చిత్రంతో మంచి ప్రశంసలు అందుకున్న తెలుగు రచయిత, దర్శకుడు రాజ్ రాచకొండ. రీసెంట్ గా “8 : AM మెట్రో” చిత్రంతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. గుల్షన్ దేవయ్య మరియు సయామి ఖేర్ నటించిన ఈ చిత్రం మే 19, 2023న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన జీ 5 లో ఉచిత స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. అయితే మల్లేశంలో హృదయాలను కొల్లగొట్టిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ 8 AM మెట్రో గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని పంచుకున్నారు. ఆమె ఈ చిత్రానికి రచయితలలో ఒకరిగా, సినిమాలో తన ప్రమేయం ఉన్నట్లు వెల్లడించింది. తన సహకారాన్ని గుర్తించినందుకు దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపింది. సినిమా ఓపెనింగ్ క్రెడిట్స్‌లో క్రియేటివ్ కన్సల్టెంట్‌లలో అనన్య నాగళ్ల ఒకరిగా గుర్తింపు పొందింది. ఇక మల్లాది వెంకట కృష్ణ మూర్తి యొక్క ప్రసిద్ధ నవల అందమైన జీవితం ఆధారంగా, స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు.
ఇటు సినిమాలు.. అటు ఫోటీషూట్లతో బిజీ..
ఇక అనన్య నాగళ్ళ సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్ గా తంత్ర సినిమాతో ప్లాప్ అందుకున్న ఈ భామ, త్వరలో పొట్టెల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక సినిమాలు తక్కువగా చేస్తున్నా, వరుస ఫోటోషూట్లతో ఎప్పటికప్పుడు రచ్చ చేస్తూ బిజీగా ఉంది ఈ భామ. నిజం చెప్పాలంటే ఇప్పుడు సినిమాల కన్నా ఫోటోషూట్ల ద్వారానే అనన్య ఎక్కువ పాపులారిటీ ని సొంతం చేసుకుంటుంది. మరి వరుస ప్లాపుల్లో ఉన్న ఈ భామకు కెరీర్ బూస్టప్ హిట్ ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.