Pradeep Machiraju : సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న యాంకర్ ప్రదీప్.. అసలు నిజమేంటంటే?

Pradeep Machiraju : ఈ మధ్య కాలంలో హీరోల కన్నా ఎక్కువగా బుల్లితెర యాంకర్స్ క్రేజ్ ను అందుకున్నారు. వారికున్న ఫాలోయింగ్ ను చూస్తే స్టార్ హీరోలు సైతం షాక్ అవ్వాల్సిందే. తెలుగు టెలివిజన్ ఫేమస్ మేల్ యాంకర్స్ లో ఎక్కువగా వినిపించే పేరు ప్రదీప్ మాచిరాజు..ప్రదీప్ హోస్టు చేసిన ఏ షో అయిన సూపర్ హిట్ అవ్వాల్సిందే.. అంతలా పాపులర్ అయ్యాడు ప్రదీప్.. తన కామెడితో కడుపుబ్బా నవ్విస్తాడు. కేవలం హోస్టుగానే కాదు. నటుడుగా, హీరోగా కూడా ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా ప్రదీప్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..

ప్రదీప్ పెళ్లి గురించి నిత్యం వార్తల్లో ఏదోకటీ వైరల్ అవుతూ ఉంటుంది. పెళ్లి వయసు దాటుతున్నా కూడా అతనికి పెళ్లి కాలేదని ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతుంటారు. కానీ ఈ విషయం పై ప్రదీప్ మాత్రం మౌనం వహిస్తుంటాడు. కానీ వార్తలు ఆగలేదు. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదు. ఏదైన ప్రాబ్లమ్ నా అని ఆయన ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఎవరికీ చెప్పకుండా అతను తన క్లాస్ మేట్ ను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటివరకు పెళ్లి ఫిక్స్ అని వార్తలు వస్తే.. ఇప్పుడు పెళ్లి అయ్యిందని వస్తున్నాయి. దీంట్లో నిజమేంత ఉందో తెలియాలంటే ప్రదీప్ రెస్పాండ్ అవ్వాల్సిందే..

Anchor Pradeep married secretly..
Anchor Pradeep married secretly..

నిజానికి ఎన్నో ఏళ్ల నుంచి యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒకసారి ఓ షోలో అతని పెళ్లి టాపిక్ వచ్చింది. ఆ క్రమంలో ప్రదీప్ పెళ్లి సెట్ అయినట్లు చెప్పారు. అంతేకాదు ఫ్రీ వెడ్డింగ్ ప్లాన్స్ లో భాగంగా మ్యూజిక్ ఈవెంట్ ని ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆ షో ప్రోమో నెట్టింట ఎంతగా వైరల్ అయ్యిందో మనం చూసే ఉన్నాం.. ఇప్పుడు పెళ్లి అయిపోయిందనే వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై ప్రదీప్ ఎలా స్పందిస్తారో చూడాలి.. ఇకపోతే ప్రదీప్ యాంకర్ గానే కాదు హీరోగా కూడా సినిమా చేశాడు.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమాలో హీరోగా చేశాడు. ఇప్పుడు మరో రెండు ప్రాజెక్టులలో నటించబోతున్నట్లు సమాచారం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు