House Full 5 : హౌస్ ఫుల్ ఫ్రాంచైజ్ నుండి తప్పుకున్న బాలీవుడ్ స్టార్.. ఆ స్థానంలో వేరే నటుడు?

House Full 5 : బాలీవుడ్ లో ఒకే కాన్సెప్ట్ తో యాక్షన్, కామెడీ ఫ్రాంచైజ్ సినిమాలు తెరకెక్కుతుండటం కామనే అన్న సంగతి తెలిసిందే. అందులో కొన్ని బాగా క్లిక్ అవుతుంటాయి. అలాగే కామెడీ ఫ్రాంచైజీల్లో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా హౌస్ ఫుల్. బాలీవుడ్ స్టార్ కిలాడీ అక్షయ్ కుమార్, అలాగే రితేష్ దేశముఖ్ లు హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా భారీ హిట్ కాగా, ఈ ఫ్రాంచైజీల్లో ఏకంగా నాలుగు సినిమాలొచ్చాయి. అన్ని సినిమాలూ మంచి హిట్ అయ్యాయో. ఇక చివరగా హౌస్ ఫుల్ 4 సినిమా 2019 లో రిలీజ్ కాగా, ఆ సినిమా సూపర్ హిట్ అయి 300 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు త్వరలోనే హౌస్ ఫుల్5 కూడా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయిపోయిందని సమాచారం. ‘హౌస్ పుల్’ సిరీస్ నుంచి వ‌స్తోన్న ఐద‌వ చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లో కొత్త షెడ్యూల్ యూకే లో మొదలు కానుందని సమాచారం. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది.

హౌస్ ఫుల్4 నుండి ఆ స్టార్ హీరో అవుట్?

అయితే తాజాగా హౌస్ ఫుల్ 4 నుండి ఓ తాజా సమాచారం వచ్చింది. హౌస్ ఫుల్ 4 లో అక్షయ్ కుమార్, అలాగే రితేష్ దేశ్ ముఖ్ కూడా హీరోలుగా నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా హౌస్‌ఫుల్ 5 తెరకెక్కుతుంది. ఈ చిత్రం లో ఎంతోమంది స్టార్ నటీనటులు నటిస్తున్నారు. అందులో అనిల్ కపూర్ కూడా ఒక కీలక పాత్రలో నటించాల్సి ఉంది. కానీ ఇప్పుడు చివరి నిమిషంలో ఈ చిత్రం నుండి ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి కారణం రెమ్యూనరేషన్ అనే వార్త వినిపిస్తుంది. ఇక పారితోషికం విషయంలోనే అనిల్ కపూర్ వాకౌట్ చేసినట్లు తెలిసింది. హౌస్ ఫుల్ 5 కోసం అనిల్ భారీ మొత్తాన్ని డిమాండ్ చేయగా, నిర్మాతలు అందుకు సిద్ధంగా లేరు, కాబట్టి అనిల్ కపూర్ ఈ చిత్రం నుండి తప్పుకున్నాడని సమాచారం.

Anil Kapoor dropped out of House Full 5 movie

- Advertisement -

అనిల్ కపూర్ స్థానంలో ఆ హీరో?

అయితే హౌస్ ఫుల్ 4 (House Full 5) లో అనిల్ కపూర్ తప్పుకోగా ఆ స్థానంలో మరో హీరోని తీసుకుంటున్నారట. బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్‌ ని అనిల్ కపూర్ రిజెక్ట్ చేసిన ఆ పాత్ర కోసం తీసుకున్నారట. ఇక అర్జున్ రాంపాల్ లాస్ట్ ఇయర్ టాలీవుడ్ లో బాలకృష్ణ భగవంత్ కేసరిలో విలన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా సంచ‌ల‌నం సృష్టించిన హౌస్ ఫుల్ ప్రాంచైజీ లో 5 వ భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ కామెడీ తారాగణం భారీగా నటిస్తున్నారని టాక్. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ డెవలెప్మెంట్ ప‌నులు జ‌రుగుతుండగా. జులైలో షూటింగ్ ప్రారంభించాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. ముందుగా అక్ష‌య్ కుమార్ తో రితేష్ దేశ్ ముఖ్ లు తొలుత షూటింగ్ లో పాల్గొంటారు. ఇక ఈ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని అక్షయ్ కుమార్ చూస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు