Animal Heroine: సందీప్ రెడ్డి ఫస్ట్ ఛాన్స్ రష్మిక కాదు… మరి ఎవరంటే?

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్క సారిగా సంచలన డైరెక్టర్ గా మారిపోయిన సందీప్ రెడ్డి వంగా నుంచి వస్తున్న తాజా చిత్రం యానిమల్. రెండో సినిమానే ఏకంగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ చేసే ఛాన్స్ కొట్టేసిన సందీప్ రెడ్డి.. ఈ అవకాశాన్ని చక్కగా వాడుకున్నాడని తెలుస్తోంది. యానిమల్ చిత్రం అర్జున్ రెడ్డి కంటే బెటర్ గా వచ్చిందని, బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని బాలీవుడ్ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ లో గానీ, సాంగ్స్ లో గానీ రష్మిక ఫర్మామెన్స్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇక అమ్మాయి… అనే సాంగ్ లో రణబీర్ కపూర్, రష్మిక మధ్య ఉన్న ఘాటు రొమాన్స్ సీన్స్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. రష్మిక క్లోజ్ గా ఉండే విజయ్ దేవరకొండకు కూడా అన్ని లిప్ లాక్స్ ఇవ్వలేదు. కానీ, రణబీర్ సినిమాలో మితి మీరిన రొమాన్స్, లిప్ లాక్స్ ఉండటం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

ఇక లిప్ లాక్ ల కోసం రష్మిక మందన్నా ప్రత్యేకంగా రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 20 లక్షల వరకు కేవలం లిప్ లాక్ ల కోసమే ఛార్జ్ చేసినట్టు టాక్. అయితే యానిమల్ లో హీరోయిన్ పాత్ర ముందుగా రష్మిక మందన్నాకు రాలేదట. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ఫస్ట్ హీరోయిన్‌గా సమంతను తీసుకోవాలని ఉండేదట.

- Advertisement -

సమంతకు యానిమల్ మూవీ స్టోరీ కూడా నచ్చిందట. కానీ, స్టోరీలో రొమాన్స్, లిప్ లాక్స్, బెడ్ రూం సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో సమంత రిజెక్ట్ చేసిందని తెలుస్తుంది. మరీ ఇంతలా రొమాన్స్ ఉండే సినిమాలను తాను చేయలేనని చెప్పడంతో… రణబీర్ కపూర్ .. రష్మిక మందన్నా పేరు సూచించారట. దీంతో ఈ రొమాన్స్, లిప్ లాక్ సన్నివేశాలకు స్పెషల్ గా రెమ్యునరేషన్ తీసుకుని, ఒకే చేసిందని టాక్.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు