Animal Movie: ఆ రెండు సినిమాలతో రష్మిక రేంజ్ మారుతుందా..?

Animal Movie

ఛలో సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది. అల్లు అర్జున్ తో కలిసి నటించిన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా గుర్తింపు సాధించింది రష్మిక. ప్రస్తుతం పుష్ప సినిమాకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప2 సినిమాతో పాటుగా రన్బీర్ కపూర్ యానిమల్ సినిమాలో కూడా నటిస్తోంది.

ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు అవ్వటమే కాకుండా హై రేంజ్ లో హైప్ ఉన్న సినిమాలు. యానిమల్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కి రెడీ అవుతుండగా, చాలా కాలం కిందట షూటింగ్ మొదలైన పుష్ప2 సినిమా మాత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది.

డైరెక్టర్ సుకుమార్ పుష్ప సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడని పార్ట్1 ని మించిన రేంజ్ లో పార్ట్2 ఉండబోతోందని సమాచారం. అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. యానిమల్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

- Advertisement -

యానిమల్ సినిమాలో రష్మిక క్యారెక్టర్ కీలకంగా ఉండబోతోందని టాక్ ఉన్న నేపథ్యంలో సినిమా మీద ఆసక్తి పెరుగుతోంది. ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక రష్మిక రేంజ్ మారుతోందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి, పుష్ప2, యానిమల్ సినిమాలు రష్మికకి వరుస పాన్ ఇండియా హిట్స్ ఇస్తాయా లేదా వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు