Tollywood : అయోధ్య స్పెషల్ గా ఏకంగా 10 సినిమాల అనౌన్స్ మెంట్…

భారతదేశంలో జనవరి 22న జరిగిన అత్యంత ప్రతిష్టాత్మక అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం గురించి తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటలకి జరిగిన బలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనకు దేశ ప్రధాన మంత్రి సహా ఎంతో మంది సెలెబ్రెటీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక టాలీవుడ్ నుండి మెగా ఫ్యామిలీ స్టార్స్ వెళ్లి అక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే ఈ స్పెషల్ డే రోజున టాలీవుడ్ లో చాలా మంది మేకర్స్ తమ కొత్త సినిమాలను అనౌన్స్ చేయడం జరిగింది.

అయోధ్య ప్రారంభోత్సవం రోజు తమ సినిమాల అనౌన్స్ మెంట్ చేయడం వల్ల కొందరు డివోషనల్ సెంటిమెంట్ గా అనౌన్స్ చేస్తే, మరికొందరు తమ సినిమాలకు ఈ స్పెషల్ డే రోజు కొంచెం మార్కెటింగ్ పరంగా బూస్టప్ దొరుకుతుందని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ స్పెషల్ డే రోజు ఒక్క టాలీవుడ్ నుండే ఏకంగా పది సినిమాల అనౌన్స్ మెంట్ జరగడం విశేషం. ఆ సినిమాల డీటెయిల్స్ ఒక్కసారి గమనిస్తే…

1. జై హనుమాన్ :
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హనుమాన్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజున అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే 2025 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

2. శ్రీ రామ్ జై హనుమాన్ :
కొత్త దర్శకుడు అవదూత డైరెక్ట్ చేయబోయే ఈ సినిమాను కె. ఏ. సురేష్ పాన్ ఇండియా మూవీ గా నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి కేవలం టైటిల్ అనౌన్స్ మెంట్ మాత్రమే చేయగా ఇతర నటీనటుల వివరాలను ప్రకటించలేదు.

3. అలనాటి రామ చంద్రుడు :
హైనివా క్రియేషన్స్ బ్యానర్ లో శ్రీ రామ్ జడపోలు నిర్మిస్తున్న ఈ సినిమాను చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కృష్ణ వంశి, మోక్ష హీరో, హీరోయిన్లు గా నటిస్తున్నారు.

4. అలా చేరే సీత రాముని చెంతకు :
జ్ఞానీ వాసుదేవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఆదియోగి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో శ్రీనివాస్. జి నిర్మిస్తున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కౌశిక్ ఘంటసాల హీరో గా నటిస్తున్నాడు.

5. రామం రాఘవం :
విలక్షణ నటుడు సముద్రఖని, టాలీవుడ్ కమెడియన్ ధనరాజ్ ప్రధాన పాత్రల్లో తండ్రి కొడుకులుగా నటిస్తున్న చిత్రం రామం రాఘవం. ఈ సినిమా అనౌన్స్ మెంట్ అయోధ్య ప్రారంభోత్సవం రోజు జరగ్గా, పృథ్వీ పోలవరపు దర్శకత్వం వహిస్తున్నాడు.

6.అజాగ్రత్త :
ఎం. శశిధర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న అజాగ్రత్త అనే సినిమాను శ్రేయాస్ తల్పడే నిర్మిస్తుండగా, కన్నడ నటి రాధిక కుమార్ స్వామి మెయిన్ లీడ్ గా నటిస్తుంది.

7. కూర్మ నాయకి :
వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు హర్ష వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మి తన కెరీర్ లోనే ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తుందని మేకర్స్ అనౌన్స్ చేసారు.

8. A మాస్టర్ పీస్ :
కొత్త దర్శకుడు సుకు పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అంతా కొత్త నటులు నటిస్తుండగా రామ్ మందిర్ ప్రారంభోత్సవం రోజు అనౌన్స్ చేయడం జరిగింది.

9. అరి :
విజయ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సూర్య పురిమేట్ల అనే యువ నటుడు హీరోగా పరిచయమవుతున్నాడు. ఆక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ అవుతుంది.

10. జై గణేష్ :
మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో తెరకెక్కుతుండగా, ఈ సినిమాలో హీరో ఒక దివ్యానంగుడిగా కనిపించబోతున్నాడని రిలీజ్ చేసిన పోస్టర్స్ ద్వారా తెలుస్తుంది. ఏప్రిల్ 11న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ అనౌన్స్ చేయడం జరిగింది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు