Another couple preparing to divorce: ఫ్యామిలీ ఫోటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో భార్య, ఇది కూడా విడాకులకు సంకేతమా.?

Another couple preparing to divorce: ప్రస్తుత కాలంలో సినిమా పరిశ్రమలు ఎంతో ఇష్టపడి చేసుకున్న పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబడటం లేదు. అయితే కొన్ని ప్రేమ పెళ్లిళ్లు ఉన్నాయి ఇంకొన్ని పెద్దలు కుదిర్చిన సంబంధాలు ఉన్నాయి. అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కొన్ని జంటలు ఏకాభిప్రాయంతో ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొందరు చడి చప్పుడు లేకుండా అఫీషియల్ గా ఇద్దరు అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నామని అనౌన్స్ చేస్తారు. కానీ కొందరు మాత్రం విడాకులు తీసుకోబోతున్నట్లు సాంకేతాలు ఇస్తూ ఉంటారు.

ఇకపోతే కొంతకాలం పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సమంతా నాగ చైతన్య. ఎంతో ఇష్టంగా ప్రేమించుకుని ఇరువైపు పెద్దలను ఒప్పించి రెండు పద్ధతులలో పెళ్లి చేసుకుంది ఈ ప్రేమ జంట. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు ముందు వచ్చినప్పుడు చాలామంది నమ్మలేదు. ఆ తర్వాత ఇంస్టాగ్రామ్ లో ఇద్దరు కలిసి దిగిన ఫొటోస్ డిలీట్ చేయటం ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవటం వలన కొన్ని కథనాలు వినిపించాయి. కొన్ని రోజుల తర్వాత ఈ కథనాలు అన్నీ కూడా నిజమే అని వాళ్లు కూడా అధికారికంగా విడాకులు ప్రకటించారు.

Another couple preparing to divorce

- Advertisement -

రీసెంట్ టైమ్స్ లో మెగా ప్రిన్సెస్ నిహారిక కూడా పెద్దలకు సంబంధం చేసుకుంది. అయితే ఈ పెళ్లి సంబంధం ఎక్కువ కాలం నిలవలేదు. వీరిద్దరూ కూడా ఏకాభిప్రాయంతో విడాకులు తీసుకున్నారు. ఇక రీసెంట్ గా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్, సైంధవి జీవి ప్రకాష్ కుమార్ కూడా విడాకులు తీసుకున్నారు. ఇకపోతే మరో జంట కూడా విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు విశ్వనీయ వర్గాల సమాచారం. తమిళ్లో జయం సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు జయం రవి. అలానే టెలివిజన్ లో బాగా పాపులర్ అయిన సుజాత కూతుర్ని ఆర్తిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆర్తి జయం రవితో కలిసి దిగిన ఫొటోస్ ని ఆ పిల్లలతో ఉన్న ఫొటోస్ ని ఇంస్టాగ్రామ్ లో డిలీట్ చేశారు. ఇక్కడితో వీరిద్దరు కూడా విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి అధికార ప్రకటన వచ్చేంతవరకు ఏమీ చెప్పలేము.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు