Jawan : మరో కోలీవుడ్ స్టార్

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నుండి వస్తున్న తాజా చిత్రం జవాన్. కోలీవుడ్ లోని ప్రముఖ దర్శకుడు అట్లీ ఈ చిత్రానికి దర్వకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవల వచ్చింది. చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అలాగే ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

తాజాగా ఈ చిత్రం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో షారూఖ్ తో పాటు మరో కోలీవుడ్ స్టార్ నటిస్తున్నడని భోగట్ట. ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. ఇటీవల బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దళపతి. జవాన్ సినిమాలో ఒక గెస్ట్ రోల్ ఉంటుందట. ఈ గెస్ట్ రోల్ కోసం విజయ్ ని తమిళ దర్శకుడు అట్లీ సంప్రదించారని సమాచారం అందుతుంది. కథ నచ్చడంతో పాటు అట్లీ తన సినిమాలోకి ఆహ్వానించడంతో విజయ్ కాదనలేక వెంటనే ఒప్పుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.

దీంతో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఒకే సినిమాలో ఉంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవడం ఖాయమని ఫ్యాన్స్ జోస్యం చెబుతున్నారు. అలాగే ఈ స్టార్స్ కలిసి నటిస్తే పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అవుతుందని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ కాంబినేషన్ వస్తుందా రాదా అనే క్లారిటీ మాత్రం చిత్ర యూనిట్ నుండి రావాల్సి ఉంది. కాగా ఇప్పటికే జవాన్ లో కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు