Divi : బిగ్ బాస్ బ్యూటీకి మరో మెగా ఆఫర్?

బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా వచ్చిన దివి చాలా మంది ప్రేక్షకులను మెప్పించింది. టైటిల్ విన్నర్ గా నిలవలేకపోయినా, ఆడియన్స్ మనసులను గెలుచుకుంది. బిగ్ బాస్ లోకి వెళ్లకముందు దివి ఎవరికిీ తెలియదు. బిగ్ బాస్ కు వెళ్లాకా దివి సినీ కెరీయర్ మారిపోయింది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను ఈ భామ కొట్టేస్తుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన అందాలను చూపిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది.

బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్ లో దివికి స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా ఛాన్స్ ఇస్తా అని చెప్పిన సంగతి విధితమే. అనుకున్నట్టు గానే ఇటీవల విడుదలై విజయం అందుకున్న గాడ్ ఫాదర్ లో దివికి మెగాస్టార్ ఒక కీలక పాత్రను ఇచ్చాడు. దీంతో పాటు ఒక క్రేజీ వెబ్ స్టోరీ, కొన్ని సినిమాల్లో కూడా దివి నటించింది. ఇదిఇలా ఉండగా ప్రస్తుతం దివి గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2లో బిగ్ బాస్ సుందరి దివి ఒక కీలక పాత్ర చేయబోతుందట. సినిమాలో ఒక సందర్భంలో వచ్చే లేడీ జర్నలిస్ట్ కు ఎవరు సెట్ అవుతారని టీం సెర్చ్ చేస్తే.. బాగ్ బాస్ బ్యూటీ దివి వీరి కంట పడిందని తెలుస్తుంది. అల్లు అర్జున్ సినిమా కాబట్టి దివి లక్కీ ఛాన్స్ అనుకుని ఎగిరి గంతేసి సినిమాకు ఒప్పుకుందట. పుష్ప పార్ట్ 1 ఎంతో పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఇప్పుడు భారీ అంచనాలతో వస్తున్న పుష్ప2 బిగ్ బాస్ బ్యూటీ దివి సినీ కెరియర్ కి ప్లస్ అవుతుందో లేదో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు