Anupama Parameswaran : అనుపమ మూవీ ఆగిపోయిందా? మాట తప్పారు అంటూ బడా నిర్మాణ సంస్థపై ట్రోలింగ్

Anupama Parameswaran : నిన్న మొన్నటిదాకా పక్కింటి అమ్మాయిలా అందంగా కనిపించిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల గ్లామర్ గేట్లు ఎత్తేసిన విషయం తెలిసిందే. తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ టిల్లు స్క్వేర్ లో తన నటనతో పాటు గ్లామర్ తో ప్రేక్షకులను ఆకర్షించింది. ఒకరకంగా ఈ మూవీ 100 కోట్లు కొల్లగొట్టడానికి అనుపమ పరమేశ్వరన్ కూడా కారణం అయ్యింది. కనీసం ఊహకు కూడా అందని రీతిలో అందాలను వడ్డించేసి, సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఆ క్రెడిట్ మొత్తం హీరో ఖాతాలో పడిపోయింది. అయితేనేమి అనుపమకు సినిమా రిలీజ్ కంటే ముందే రావాల్సిన పాపులారిటీ మొత్తం వచ్చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. తెలుగులో BSS 11, పరదా, మారిచిక అనే సినిమాలు చేస్తోంది. అయితే ఆమె నెక్స్ట్ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఓ నిర్మాణ సంస్థ తీరుపై చిరాకు వచ్చినట్టుంది. అనుపమతో సినిమా విషయంలో సదరు బడా నిర్మాణ సంస్థ వ్యవహరిస్తున్న తీరును సోషల్ మీడియా వేదికగా ఏకీపారేస్తున్నారు. ఇంతకీ ఆ నిర్మాణ సంస్థ ఏంటి? ఈ గోలంతా ఏ మూవీ గురించి? అనే వివరాల్లోకి వెళితే…

ఈ సైలెన్స్ కు కారణం ఏంటి ?

రీసెంట్ గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది అంటూ ప్రకటించిన సినిమాల్లో లాక్ డౌన్ కూడా ఒకటి. అనుపమ ప్రధాన పాత్రను పోషించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ఇది. ఇక ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ అనే పెద్ద నిర్మాణ సంస్థ నిర్మించింది. అయితే లాక్ డౌన్ మూవీని ముందుగా జూన్ లో రిలీజ్ చేస్తామని ప్రమోషన్స్ కూడా చేశారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ సాంగ్ ముగింపు క్రెడిట్ లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కానీ సడన్ గా సైలెంట్ అయ్యారు. కనీసం ఈ మూవీ ఆలస్యం అవుతుందన్న అప్డేట్ కూడా ఇవ్వలేదు. లాక్ డౌన్ మూవీ రిలీజ్ పై అభిమానులకు ఎలాంటి క్లూ లేకుండా పోవడంతో తాజాగా సోషల్ మీడియా వేదికగా ఇదే విషయంపై లైకా ప్రొడక్షన్స్ వారిని నిలదీస్తున్నారు.

Anupama Parameswaran's Lockdown's major update! Find out all the details here...

- Advertisement -

అను మూవీని పక్కన పడేశారా ?

ఇప్పుడు ఈ మూవీ గురించి ప్రస్తావించడానికి సందర్భం ఏంటి అంటే లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఇండియన్ 2 మూవీ రిలీజ్. జూలై 12న ఇండియన్ 2 భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రమోషన్లు జోరుగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లైకా ప్రొడక్షన్స్ అనుపమ మూవీ లాక్ డౌన్ విషయంలో మాట తప్పింది అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే నిజానికి ప్రస్తుతం చిన్న సినిమాల రిలీజ్ కు సరైన స్లాట్ అందుబాటులో లేదనే చెప్పాలి. ఆల్మోస్ట్ వచ్చే ఏడాది వరకు రిలీజ్ డేట్ లన్ని ఫుల్ అయిపోయాయి. మరి ఈ గ్యాప్ లో అసలు లాక్ డౌన్ తెరపైకి వస్తుందా? లేదంటే పూర్తిగా ఈ మూవీని పక్కన పడేశారా? అన్నది తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు