Chandra Mohan : బయటికి వచ్చిన నిజాలు… ఆయన ఆస్తి ఎవరికో తెలుసా?

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ చంద్రమోహన్ రీసెంట్ గా అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని, హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ దాకా అన్ని రకాల పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. నాలుగు తరాల ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న చంద్రమోహన్ ఇప్పుడు మన మధ్య లేడు అన్నది ఆయన అభిమానులకు కష్టం కలిగించే విషయం. ఈ క్రమంలోనే చంద్రమోహన్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా సినిమాలో ఉన్నంతకాలం ఆయన సంపాదించిన ఆస్తిని ఏం చేశాడన్న విషయం గురించి చర్చ నడుస్తోంది.

అయితే చంద్రమోహన్ తన ఆస్తి విషయంలో తీసుకున్న నిర్ణయంపై అందరూ ప్రశంసలకు కురిపిస్తున్నారు. సినిమాలోనే కాదు, నిజ జీవితంలోనూ ఆయన ఎంతో ఉన్నతమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి అంటూ చంద్రమోహన్ గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నారు. మరి ఆయన ఆస్తిని ఏం చేశారు ? అన్న విషయానికి వస్తే… చంద్రమోహన్ తన ఆస్తి మొత్తాన్ని మూడు భాగాలుగా చేశారట. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్న విషయం తెలిసిందే. వారిద్దరికీ చెరో భాగం రాసిచ్చారట. అలాగే మూడవ భాగం ఆస్తిని మాత్రం ఓ అనాధ శరణాలయానికి రాసిచ్చారట. ఆ శరణాలయం పేరు బయటకు రాలేదు కానీ, ఈ విషయం మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది.

ఎంత ఆస్తి ఉన్నా తన తదనంతరం పిల్లలకు మాత్రమే చెందాలని ఆలోచించే మనుషులు ఉన్న ఈ రోజుల్లో చంద్రమోహన్ లాంటి మంచి మనిషి ఉండడం గొప్ప విషయమని అంటున్నారు. ఇక కోట్లు పారితోషికం తీసుకుంటున్న చాలామంది హీరోలకు కూడా ఇంత గొప్ప మనసు ఉండదు అంటూ, చంద్రమోహన్ ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ఈనెల 11న చంద్రమోహన్ గుండె సంబంధిత సమస్యల కారణంగా కన్నుమూశారు. చనిపోయే నాటికి ఆయన వయసు 82 సంవత్సరాలు. తన జీవిత కాలంలో 932కు పైగా సినిమాల్లో నటించిన చంద్రమోహన్, చనిపోవడానికి కొన్ని రోజుల ముందు నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

- Advertisement -

‘టాలీవుడ్ రిషి కపూర్’గా పేరుగాంచిన చంద్ర మోహన్, అనేక పాత్రలను సునాయాసంగా పోషించి, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. 80లలో చంద్రమోహన్ తో నటించిన హీరోయిన్లు ఆ తరువాత స్టార్ హీరోయిన్లుగా మారిపోయారు. దీంతో ఆయనను లక్కీ స్టార్ అనేవారు. ఇక టాలీవుడ్ లో ఆయన లేని లోటు తీర్చలేనిది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు