Arman Malik : బిగ్ బాస్ ఝలక్.. ఆ వీడియో లీక్ అవ్వడంతో విడాకులు..

Arman Malik : టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రతి ఇండస్ట్రీలోని నడుస్తుంది.. హిందీలో ఓటిటిలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.. ప్రస్తుతం మూడో సీజన్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.. ఆ సీజన్ లో కంటెస్టెంట్స్ రొమాన్స్ తో రచ్చ చేస్తున్నారు. ఇటీవలే ఓ వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే.. ఈ షోకు యూట్యూబర్‌ ఆర్మాన్ మాలిక్‌, అతని ఇద్దరు భార్యలు కూడా వచ్చారు. అయితే మొదటి వారమే అర్మాన్ భార్యల్లో ఒకరైన పాయల్ ఎలిమినేట్ అయింది.. ఆ తర్వాత హౌస్ లో ఉన్న మరో భార్య తో రొమాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఇప్పుడు తన భార్య విడాకులు తీసుకోబోతుందని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది..

హిందీ బిగ్ బాస్ ఓటిటి కి హోస్ట్ గా అనిల్ కపూర్ వ్యవహరిస్తున్నారు. ఈ షోకు పలువురు సెలెబ్రెటీలతో పాటుగా ప్రముఖ యూట్యూబర్‌ ఆర్మాన్ మాలిక్‌, అతని ఇద్దరు భార్యలు కూడా వచ్చారు. అయితే మొదటి వారమే అర్మాన్ భార్యల్లో ఒకరైన పాయల్ ఎలిమినేట్ అయింది.. ఆ తర్వాత రెండో భార్యతో టాస్కులు చేసాడు. భార్యను చూసి ఆపుకోలేక పోయిన అర్మాన్ ఓ రోజు రాత్రి రొమాన్స్ చేసాడు. ఆ వీడియో కెమెరాల్లో రికార్డు అయ్యింది. దాన్ని బిగ్ బాస్ రిలీజ్ చేసింది. అది చూసిన రెండో భార్య తట్టుకోలేక పోయింది.. అతనికి విడాకులు ఇస్తున్నానని స్టేట్మెంట్ ఇచ్చింది..

Armaan Malik's second wife gave a shock
Armaan Malik’s second wife gave a shock

నేను, కృతిక ఇద్దరం ఆర్మాన్ ని లవ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరేగా ఉన్నాయి. నేను నా భర్తతో విడిపోవాలనుకుంటున్నాను. నిర్ణయం తీసేసుకున్నాను నేను నా పిల్లలను తీసుకొని వెళ్తాను.. అయితే ఆమె బాబును కూడా నేనే పెంచుతాను మా బాబు ఉండలేడు.. వాళ్ళు ఇద్దరే కలిసి ఉండొచ్చు అని షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆర్మాన్, అతని రెండో భార్య కృతిక బిగ్ బాస్ లోనే ఉన్నారు కాబట్టి ఈ విషయాలు ఇంకా తెలిసాయా లేదా అనేది సందేహమే. మరి బయటకు వచ్చాక వాళ్ళు పాయల్ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఏది ఏమైనా ఈ వార్త బాలీవుడ్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు