Samajavaragamana: సెకండ్ వీక్ కూడా తగ్గట్లే – శ్రీవిష్ణుకి అలా కలిసొచ్చిందా..?

ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అయిన శ్రీవిష్ణు హీరోగా నటించిన సామజవరగమన సినిమా హిట్ టాక్ సొంతం చేసుకొని మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటిరోజు నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇప్పటివరకు సుమారు 30కోట్ల గ్రాస్, 20కోట్ల షేర్ సొంతం చేసుకున్న ఈ సినిమా సెకండ్ వీకెండ్ కూడా మంచి ఆక్యుపెన్సీ సొంతం చేసుకుంది. అదే రోజు రిలీజ్ అయిన నిఖిల్ స్పై సినిమా డివైడ్ టాక్ సొంతం చేసుకోవటం సామజవరగమన సినిమాకి ఒకరకంగా ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు. మిడిల్ క్లాస్ బ్యాక్డ్రాప్ లో తండ్రి కొడుకుల మధ్య క్లీన్ కామెడీతో తెరకెక్కిన ఈ సినిమాను జనం బాగా ఆదరిస్తున్నారు.

ఈ వారం రిలీజ్ అయిన రంగబలి సహా రుద్రంగి, భాగ్ సాలే, సర్కిల్ వంటి చిన్న సినిమాలు అలరించని నేపథ్యంలో రెండో వీకెండ్ కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి శ్రీవిష్ణు కెరీర్లో ఈ సినిమా హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందని చెప్పాలి. శ్రీవిష్ణు గత సినిమాలకు కామెడీని పక్కన పెట్టి సీరియస్ కథలు ట్రై చేసి ఫ్లాప్స్ అందుకున్న శ్రీవిష్ణు ఈ సినిమాతో మళ్ళీ కామెడీ జానర్ తో హిట్ హిట్ కొట్టడం పట్ల ఆడియెన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమ్మర్లో  పెద్ద సినిమాలేవీ లేకపోవటం వచ్చిన మీడియం బడ్జెట్ సినిమాలు కూడా పెద్దగా అలరించని నేపథ్యంలో సామజవరగమన క్లీన్ కామెడీతో వచ్చి ఆ లోటును తీర్చిందని చెప్పాలి. ఈ క్రమంలో శ్రీవిష్ణు తన తర్వాత సినిమాకు కూడా కామెడీనే నమ్ముకుంటాడా లేక మళ్ళీ సీరియస్ కథలవైపు చూస్తాడా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు