Selfish Movie : ఆగిపోయిన ఆశిష్ రెడ్డి మూవీ… దిల్ రాజు అంతా నాశనం చేస్తున్నారా?

దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి “రౌడీ బాయ్స్” అనే సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలకు బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చి స్టార్ హీరోలుగా మార్చిన దిల్ రాజు తన వారసుడికి మాత్రం ఫస్ట్ మూవీతో ఓవర్ నైట్ స్టార్ట్ చేయలేకపోయాడు. “రౌడీ బాయ్స్” మూవీ కమర్షియల్ గా ఫెయిల్యూర్ కావడంతో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అందుకే ఆశిష్ కు ఈసారైనా మంచి సక్సెస్ అందించాలని దిల్ రాజు పట్టుదలగా ఉన్నాడు. అందుకు తగ్గట్టుగానే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు.

ప్రస్తుతం ఆశిష్ హీరోగా “సెల్ఫిష్” అనే మూవీ తెరకెక్కుతోంది. విశాల్ కాశి దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ఇవానాను ఖరారు చేశారు. ఆమె ఈ సినిమాలో చిత్ర అనే పాత్రలో నటించబోతున్నట్టుగా అఫీషియల్ గా ప్రకటించారు. అయితే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా అశోక్ వనంలో అర్జున కళ్యాణం ఫేమ్ రితికా నాయక్ ను హీరోయిన్ గా అనుకున్నారట. ఆ తర్వాత ఏమైందో ఏమో గాని రితిక స్థానంలో ఇవానాను తీసుకున్నట్టు తెలుస్తోంది.

“లవ్ టుడే” అనే సినిమాతో ఇవానాకు యూత్ లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. ప్రస్తుతం ఆశిష్ నటిస్తున్న మూవీ కూడా యూత్ ఫుల్ కాన్సెప్ట్ కావడంతో ఇవానాకు ఉన్న క్రేజ్ “సెల్ఫిష్”కు కలిసి వస్తుందన్న ఆలోచనతోనే దిల్ రాజు ఆమెను ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారట. ఇక “రౌడీ బాయ్స్” విషయంలో జరిగిన తప్పులు మళ్లీ రిపీట్ కాకూడదనే ఆలోచనతో దిల్ రాజు “సెల్ఫిష్” మూవీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా సమాచారం.

- Advertisement -

అయితే తాజాగా ఈ మూవీని ప్రస్తుతానికి ఆపేసారు అనే వార్త ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. స్క్రిప్ట్ కారణంగా ‘సెల్ఫిష్’ మూవీని తాత్కాలికంగా నిలిపేశారట. స్క్రిప్ట్ ను మళ్లీ సెట్ చేసుకుని సినిమాను రీస్టార్ట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. 80% షూటింగ్ పూర్తయ్యాక, అవుట్ పుట్ నచ్చకపోవడంతో ఈ మూవీని పక్కన పెట్టేసారని టాక్. ఇక ఈ విషయం తెలిసిన నెటిజెన్లు మార్చాల్సింది స్క్రిప్ట్ కాదు యాక్టింగ్ అంటూ ఆశిష్ రెడ్డి పై సెటైర్లు వేస్తున్నారు. మరి ఆశిష్ రెడ్డి కోసం దిల్ రాజు ఎలాంటి స్క్రిప్ట్ వేటలో ఉన్నారో?

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు