Baby: విజయ్, అనసూయ కాంట్రవర్సీపై స్పందించిన ఆనంద్ దేవరకొండ..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, హాట్ యాంకర్ అనసూయ మధ్య నెలకొన్న వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అర్జున్ రెడ్డి సినిమా సమయంలో మొదలైన ఈ వివాదం తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చేది. అయితే, ఇటీవల అనసూయ తనకు మానసిక ప్రశాంతత కావాలంటూ కావాలని ఇకపై ఈ వివాదాన్ని కొనసాగించాలని అనుకోవట్లేదని స్టేట్మెంట్ ఇవ్వడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడ్డట్టయింది. ఇదే అంశంపై తాజాగా ఆనంద్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశాడు, విజయ్ కి అనసూయకి మధ్య అసలు ఏం జరిగిందో తనకు తెలియదంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం బేబీ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఆనంద్ ఓ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఈ వివాదంలో ఒకవైపు వర్షన్ మాత్రమే తనకి తెలుసని, వాళ్లిద్దరి మధ్య ఇష్యూ ఏంటో కూడా తనకి తెలీదని చెప్పాడు ఆనంద్. అయితే, విజయ్ తో వివాదానికి స్వస్తి పలికిన అనసూయ ఇటీవల రిలీజ్ అయిన బేబీ సినిమా ట్రైలర్ తనకు నచ్చిందంటూ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యింది. ఇందులో ఆనంద్ చాలా ఇంటెన్స్ గా కనిపించాడని కితాబిచ్చింది.

ఆనంద్ దేవరకొండ సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జులై 14న రిలిజ్ కి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకొని సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. మరి, కెరీర్ ఆరంభం నుండి సన్సిటివ్ కథలతో సినిమాలు చేస్తున్న ఆనంద్ దేవరకొండకి బేబీ బ్లాక్ బస్టర్ అందిస్తుందా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు