Baby: చిన్న సినిమాలకు ప్రీమియర్స్ ప్లస్ అవుతున్నాయా..?

టాలీవుడ్లో ఈ మధ్య ప్రీమియర్స్ ట్రెండ్ ఊపందుకుంటుంది. ప్రీమియర్స్ కూడా ప్రమోషన్స్ లో భాగం అయిపోయాయి. మొన్నటిదాకా ఇండస్ట్రీ వర్గాలకు, జర్నలిస్టులకు ప్రివ్యూలు వేయటం ఆనవాయితీగా ఉండేది కానీ ఇప్పుడు పెయిడ్ ప్రీమియర్స్ వేయటం మొదలైంది. ఈ ట్రెండ్ చిన్న సినిమాలకు ప్లస్ అవుతుందనే చెప్పాలి. ఇటీవల రిలీజ్ అయిన సామజవరగమన, బేబీ సినిమాలకు ప్రీమియర్స్ ద్వారా పాజిటివ్ టాక్ రావటమే ఇందుకు నిదర్శనం. ప్రమోషన్స్ పెద్దగా చేయని సామజ వార గమన సినిమాకు ప్రీమియర్స్ లో వచ్చిన పాజిటివ్ టాక్ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేందుకు హెల్ప్ అయ్యింది. ఈ సినిమా శ్రీవిష్ణు కెరీర్లోనే అత్యధికంగా 40కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది.

ఆనంద్ దేవరకొండ హీరోగా సాయి రాజేష్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన బేబీ సినిమాకు కూడా ప్రీమియర్స్ పాజిటివ్ టాక్ తెచ్చి పెట్టాయి. టీజర్, ట్రైలర్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు ప్రీమియర్స్ లో వచ్చిన పాజిటివ్ టాక్ మరింత ప్లస్ అయ్యిందని చెప్పాలి. బేబీ సినిమా మొదటి రోజే 7కోట్ల గ్రాస్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ దిశగా అడుగులేస్తోంది. కెరీర్ మొదటి నుండి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆనంద్ దేవరకొండకు ఈ సినిమా ద్వారా నటన పరంగా మంచి మార్కులు పడటం విశేషం.

అంతే కాకుండా, మేం ఫేమస్ వంటి యావరేజ్ సినిమాలు కూడా ప్రీమియర్స్ వల్ల హిట్ రేంజ్ లో వసూళ్లు సాధించాయి. మరో పక్క యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాలకు కూడా ప్రీమియర్స్ ద్వారా హడావిడి చేసి ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక బోల్తా పడ్డ సినిమాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద సినిమాలో కంటెంట్ ఉన్నప్పుడు ప్రీమియర్స్ అనేది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది తప్ప కంటెంట్ లేకుంటే ఏ మాత్రం ప్లస్ అవ్వవు అని చెప్పాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు