Viswam : టైటిల్ సెంటిమెంటే కాదు.. ఇప్పుడు ఆ సెంటిమెంట్ కూడా!.. వర్కౌట్ అవుతుందా?

Viswam : టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ శ్రీనువైట్ల దర్శకత్వంలో “విశ్వం” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పదేళ్ళుగా సరైన సక్సెస్ లేని హీరో, దర్శకుడు ఇప్పుడు స్ట్రాంగ్ క‌మ్ బ్యాక్ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్రేక్ష‌కులు మెచ్చే విధంగా ఈ సినిమాను రూపొందించేలా శ్రీనువైట్ల శతవిధాలా ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మంచి యాక్ష‌న్ తో పాటు వైట్ల త‌న‌దైన వింటేజ్ కామెడీ సీన్స్ పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో తన వెంకీ సినిమాలో ఐకానిక్ ట్రైన్ కామెడీ సీన్ న కూడా విశ్వం లో రీ క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. త్వరలోనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసి ప్రమోషన్లు స్టార్ట్ చేయనున్నారు మేకర్స్.

Baby sentiment in Gopichand Viswam movie

భారీ బడ్జెట్ తో విశ్వం…

ఇక విశ్వం (Viswam) సినిమాకు చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తుండ‌గా, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై టిజి.విశ్వ‌ప్ర‌సాద్, వివేక్ కూచిబొట్ల అలాగే వేణు దొనెపూడి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక కావ్య థాపర్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో సీనియర్ నరేష్, ఆర్టిస్ట్ ప్రగతి, అలాగే అజయ్ ఘోష్, చమ్మక్ చంద్ర, వెన్నెల కిషోర్, షకలక శంకర్, శ్రీనివాసరెడ్డి తదితరులు కూడా నటిస్తున్నట్టు రీసెంట్ గా మేకింగ్ వీడియోలో తెలిసింది. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.

- Advertisement -

సెంటిమెంట్ తో వస్తున్న విశ్వం..

ఇక గోపీచంద్ – శ్రీనువైట్ల విశ్వం సినిమాకు ఈసారి సెంటిమెంట్ ని కూడా బాగానే నమ్ముకున్నారని తెలుస్తుంది. గోపీచంద్ సినిమాలకు టైటిల్ చివర సున్నా ఉండే సెంటిమెంట్, రెండక్షరాల సెంటిమెంట్ ఎప్పట్నుంచో ఉంది. అది ఇప్పుడు విశ్వం కు కూడా అప్లై చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో శ్రీను వైట్ల ట్రైన్ సీన్ సెంటిమెంట్ కూడా వాడుతున్నారు. ఇప్పుడు తాజాగా మరో సెంటిమెంట్ యాడ్ అయింది. విశ్వం సినిమా ‘పాప’ సెంటిమెంట్ తో తెరకెక్కుతోందని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందు ఈ హీరో దర్శకుల సినిమాలు పాప సెంటిమెంట్ తో వచ్చాయో లేదో పెద్దగా తెలీదు.. కాని తెలుగులో చాలా వరకు పాప సెంటిమెంట్ తో సినిమాలు వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి. మరి ఈ సెంటిమెంట్ విశ్వం సినిమాకు ఎంత వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు