Akhanda2 : బాలయ్య అడ్డాలోనే అఖండ2 ఆరంభమట?

Akhanda2 : నందమూరి బాలకృష్ణ గత కొన్ని రోజులుగా ఎన్నికల హడావిడి వల్ల షూటింగ్ లు ఆపేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు బాలయ్య సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక ఎన్నికల్లో టిడిపి తరపున బాగా ప్రచారం చేసిన బాలకృష్ణ జూన్ 4న వెలువడిన ఎన్నికల ఫలితాలలో ఘన విజయం కూడా సాధించి ముచ్చటగా మూడో సారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఇప్పుడు ఎన్నికల హడావిడి మొత్తం అయిపోతుంది. మరో రెండు రోజుల్లో అధికారం లోకి వచ్చిన టిడిపి సహా మంత్రులతో బాలకృష్ణ ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక అతి త్వరలోనే బాలకృష్ణ సెట్స్ పై ఉన్న సినిమాలను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెట్స్ పై ఉన్న సినిమాలు పూర్తి చేయడమే కాకుండా, అతి త్వరలోనే కొత్త ప్రాజెక్ట్స్ కూడా మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

Balakrishna Akhanda2 movie launch in Hindupuram

బాబీ సినిమా పూర్తి కాగానే అఖండ2..

ఇక ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో బాలయ్య కెరీర్ లో 109వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ చేయని ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఆ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిమల్ విలన్ బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ 60 శాతానికి పైగా పూర్తవగా, త్వరలోనే సెట్స్ లో అడుగుపెట్టి మిగతా భాగాన్ని పూర్తి చేయనున్నారు. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలయ్య మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టనున్నారు. ఆ సినిమాయే “అఖండ2”. బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ లో మూడేళ్ళ కింద వచ్చిన అఖండ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పట్నుంచో ఈ సినిమా సీక్వెల్ వస్తుందని వార్తలు వస్తుండగా, బోయపాటి శ్రీను సీక్వెల్ ఉంటుందని త్వరలోనే స్టార్ట్ చేస్తున్నామని అనౌన్స్ కూడా చేసారు. ఇక బాబీ తో చేస్తున్న సినిమా పూర్తి కాగానే బాలయ్య అఖండ2 (Akhanda2) ని మొదలుపెట్టనున్నారని సమాచారం.

- Advertisement -

అఖండ2 ఆరంభం అక్కడే?

ఇక బాలకృష్ణ నుంచి ఉన్న సాలిడ్ లైనప్ లో ఎగ్జైటింగ్ గా ఉన్న చిత్రం “అఖండ” సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తుండగా, మొదట ప్రారంభోత్సవం అట్టహాసంగా జరపాలని ప్లాన్ చేస్తున్నారు. తన హ్యాట్రిక్ హిట్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, అయితే ఈ చిత్రంపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అండ్ సాలిడ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ చిత్రం బాలయ్య బర్త్ డే కానుకగా ఆరంభం కానుండగా, ఈ సినిమా బాలయ్య అడ్డా, అలాగే తాను ఎమ్మెల్యేగా నెగ్గిన “హిందూపురం” లోనే ప్రారంభం కానున్నట్టుగా వినిపిస్తుంది. దీంతో బోయపాటి శ్రీను సాలిడ్ ప్లానింగ్ లనే చేస్తున్నారని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాపై మరిన్ని అధికారికంగా డీటెయిల్స్ రావాల్సి ఉన్నాయి. మరి ఈ సినిమాతో బాలయ్య బోయపాటి మరోసారి రికార్డులు సృష్టిస్తారా చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు