Balakrishna – Ram Pothineni: ఒక మల్టీస్టారర్ సినిమా కోసం ఇద్దరు దర్శకులు పనిచేయనున్నారు

Balakrishna – Ram Pothineni: మిషన్ టైమ్స్ లో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువ అయ్యాయి. అయితే ఒకప్పుడు కూడా మల్టీ స్టార్ సినిమాలు ఎక్కువగా వచ్చేవి. కానీ కొంతకాలం తర్వాత మల్టీస్టారర్ సినిమాలు కాస్త తగ్గిపోయి పాన్ వర్డ్స్ కూడా మొదలయ్యాయి. నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి అంటూ ఫ్యాన్స్ అప్పట్లో చాలా హడావిడి మొదలు పెట్టేవారు. అయితే అది చాలా కాలం పాటు కొనసాగింది. బాక్స్ ఆఫీస్ వద్ద మీరు సినిమాలకి ఇప్పుడు సరైన పోటీ ఉండేది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తున్న తరుణంలో బాలకృష్ణ అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ కూడా చేసేవారు. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో కూడా మల్టీ స్టారర్ సినిమాల హవా మొదలైంది.

శ్రీకాంత్ అడ్డాల దర్శకుడుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాను తెరకెక్కించారు. చాలా ఏళ్లు తర్వాత ఆ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్ళీ మల్టీ స్టారర్ సినిమాలకు ప్రారంభం మొదలైంది. ఆ సినిమా తర్వాత వరుసగా మల్టీ స్టారర్ సినిమాలు వచ్చాయి. ఇక ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో రానా దగ్గుబాటి ప్రభాస్ ను కలిపాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ రామ్ చరణ్ లను కలిపి సినిమాను తీసాడు. ఇలా తీయడం వల్ల ఫ్యాన్ వార్స్ తగ్గే అవకాశం ఉందని చాలామంది భావించారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మా హీరోది మెయిన్ రోల్ అంటూ చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి.

Balakrishna

- Advertisement -

ఇక ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో మల్టీ స్టారర్ సినిమా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ, రామ్ పోతినేని కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు విశ్వసినీయ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమా కోసం ఇద్దరు దర్శకులు పని చేయనున్నట్లు తెలుస్తోంది. దీని గురించి అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇకపోతే ఇంతకుముందు రామ్ విక్టరీ వెంకటేష్ తో కలిసి మసాలా అనే సినిమాలో నటించాడు. ఇప్పుడు బాలకృష్ణతో కలిసి నటిస్తే ఆ సినిమా పైన అంచనాలను కూడా ఎక్కువగా ఉంటాయి.

ఇకపోతే వీరిద్దరికి మంచి పరిచయం ఉన్న దర్శకుడు బోయపాటి శ్రీను. వీరిద్దరినీ కలిపి సినిమా చేయగల సామర్థ్యం ఉన్నది కూడా బోయపాటి శ్రీను కు మాత్రమే. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇద్దరు డైరెక్టర్లు అంటున్నారు కాబట్టి అందులో బోయపాటి శ్రీను ఉండకపోవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు