Balayya : ఈ ఒక్క రీజన్ తో బాలయ్య, బన్నీని చూసి భయపడుతున్న ఆ ఇద్దరు హీరోలు

Balayya : సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితులు సలార్ టైంను గుర్తు తెస్తున్నాయి. సలార్ మూవీ రిలీజ్ డేట్ పలుమార్లు వాయిదా పడడంతో అప్పట్లో ఎన్నో చిన్న సినిమాల హీరోలు ఇబ్బందులు పడ్డారు, నిర్మాతలు బడ్జెట్ భారాన్ని మోయాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి బాలయ్య, బన్నీ వల్ల అదే పరిస్థితి నెలకొన్నట్టుగా అనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఇద్దరు హీరోలను చూసి ఇండస్ట్రిలో మరో ఇద్దరు యంగ్ హీరోలు తెగ టెన్షన్ పడుతున్నారు. మరి వాళ్ళిద్దరూ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

బాలయ్య, బన్నీ వల్ల ఇబ్బందులు…

రీసెంట్ గా పుష్ప 2 మూవీని ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6 కు వాయిదా వేస్తున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీనివల్ల డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకున్న సినిమాలకు ఇబ్బందులు తప్పవు. ఇక మరోవైపు బాలయ్య కూడా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 109 సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ చేయాలనుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఉరుము ఉరిమి మంగళం మీద పడింది అన్నట్టుగా ఇప్పుడు ఈ ఇద్దరు హీరోల రిలీజ్ డేట్ల వల్ల మరో ఇద్దరు యంగ్ హీరోల సినిమాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది.

Allu Arjun & Balayya Disrupting Plans Of Others?

- Advertisement -

నష్టం బాలయ్యకేనా?

ఒకవేళ బాలయ్య సినిమాను డిసెంబర్లోనే తీసుకురావాలి అనుకుంటే నిర్మాతలకు నష్టం తప్పదు. ఈ రెండు సినిమాలకు మధ్య గ్యాప్ కేవలం 15 రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి కలెక్షన్ల పరంగా రెండు సినిమాలకు గండి పడుతుంది. అయితే ముందుగా రిలీజ్ అయ్యేది పుష్ప 2 కాబట్టి బన్నీ కొంత వరకు సేఫ్. కానీ పుష్ప 2 హిట్ అయితే తరువాత వచ్చే బాలయ్యకే నష్టం. బన్నీ తగ్గే అవకాశం లేదు కాబట్టి బాలయ్య వెనక్కి తగ్గాల్సి ఉంటుంది. కానీ కాదని క్రిస్మస్ కే వస్తే ఆ ఎఫెక్ట్ ఈ ఇద్దరు హీరోలతో పాటు మరో ఇద్దరిపై కూడా పడుతుంది.

ఈ ఇద్దరికీ సోలో రిలీజ్ డేట్ ముఖ్యం

బన్నీ, బాలయ్యను చూసి టెన్షన్ పడుతున్న ఇద్దరు హీరోలలో నాగ చైతన్య, నితిన్ ఉన్నారు. ఇద్దరు హీరోలు తండేల్, రాబిన్ హుడ్ సినిమాలను డిసెంబర్ 20న తమ సినిమాలను రిలీజ్ చేయబోతున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు పుష్ప డిసెంబర్ కి జంప్ అవడం, బాలయ్య కూడా డిసెంబర్ పైనే కన్నయ్యడంతో అటు నాగచైతన్యకు, ఇటు నితిన్ కు ఇబ్బందులు తప్పేలా లేవు. నిజానికి తండేల్ నాగచైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో వస్తోంది. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టాలి అన్నా, రాబిన్ హుడ్ లో నితిన్, వెండికుడుముల కామెడీ టైమింగ్ వర్కౌట్ అవ్వాలన్నా సోలో రిలీజ్ డేట్ ముఖ్యం. అయితే బన్నీ, బాలయ్య ఇద్దరు డిసెంబర్ లో తిష్ట వేసుకుని కూర్చుంటే ఈ రెండు సినిమాలతో పాటు ఇతర సినిమాలకు కూడా నష్టం తప్పదు. మొత్తానికి బాలయ్య నిర్ణయంపైనే ఈ ఇద్దరు హీరోల సినిమాల భవిష్యత్ ఆధారపడి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు